2013 తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేదు.. ఏదైనా మార్గం కనుక్కోవాలి

కలకత్తా: టీమిండియా 2013 తర్వాత ఇప్పటివరకు ఐసీసీ టోర్నీ గెలవలేదు. ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచేందుకు ఏదైనా మార్గం కనుక్కోవాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఆడిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో దాదా స్పందించారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

మార్గం కనుక్కోవాలి:
సోమవారం గుంగూలీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... '2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఆ తర్వాత మరే ఐసీసీ టోర్నీ గెలవలేదు. ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచేందుకు ఏదైనా మార్గం కనుక్కోవాలి. ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్ గొప్పగా పుంజుకుంది. 2015 పరాజయం నుంచి నేర్చుకొని ఛాంపియన్ అయింది. అలా మనం కూడా ఏదైనా చేయాలి' అని గంగూలీ సూచించారు.

గెలిపించే ఇన్నింగ్స్‌లు అవసరం:
'ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువైతే స్వేచ్ఛగా ఆడలేరు. మొదటగా ఒత్తిడిని తొలగించాలి. ఆటగాళ్లు,సెలక్టర్లు, జట్టు యాజమాన్యం మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఎప్పుడో ఓ సారి ఆడే ఆటగాడు కాకుండా.. మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌లు, బౌలింగ్ స్పెల్స్‌లు జట్టుకు అవసరం. యువకులు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాల నుంచి ఏంతో నేర్చుకోవచ్చు' అని గుంగూలీ అన్నారు.

ఆటగాళ్లలో స్థిరత్వం ఉండాలి:
'మూడు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లు కాకుండా.. అన్ని ఫార్మాట్లలలో నిలకడగా ఆడే ఆటగాళ్లు జట్టుకు కావాలని సూచించాను. కొంతమంది ఆటగాళ్ళు జూన్ నెలలో ఆడి మళ్లీ డిసెంబరులో ఆడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వసం చాలా ముఖ్యం. ఆటగాళ్లలో స్థిరత్వం ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే సహనం ఉండాలని' దాదా పేర్కొన్నాడు.

గుసగుసలు సహజమే:
'జట్టులో విభేదాలు గతంలో విన్నాను. భవిష్యత్తులో కూడా వినిపిస్తాయి. జట్టు గెలిస్తే అంతా బాగానే ఉంటుంది. ఓడితేనే ఇలాంటివి వినిపిస్తాయి. అందులో మెగా టోర్నీ సెమీఫైనల్ నుండి బయటికి వచ్చాం కదా గుసగుసలు సహజమే. జట్టుకు ఇద్దరి కెప్టెన్లు గతంలో పనిచేశారు. నిజానికి దాని గురించి ఆలోచించట్లేదు. ఇది సెలెక్టర్ల నిర్ణయం. ధోనీ ఆర్మీలో పనిచేయడం ప్రశంసనీయం. ధోనీని 2023 ప్రపంచకప్‌లో చూడాలనికోవట్లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ చివరిది అనుకుంటున్నా' అని దాదా చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications