Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని టాలెంట్‌ను భారత్ మిస్ చేసుకుంది- గంభీర్

రాజస్థాన్ రాయల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీనిలో అశ్విన్‌తో కలిసి గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అశ్విన్‌ను కొనియాడుతూ టీమిండియా మాజీ ఓపెనర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ పూర్తి సామర్థ్యాన్ని భారత్ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయిందని గంభీర్ అన్నాడు.

భారత్ తరఫున 37 ఏళ్ల అశ్విన్ 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యాష్ సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న అశ్విన్ ప్రస్తుతం టెస్టులకే పరిమితమయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు యాష్‌ను సెలక్టర్లు ఎంపిక చేయట్లేదు.

India has seen Ashwin s potential with the ball but not fully with the bat- Gambhir

అయితే 2022లో టీ20 వరల్డ్ కప్, గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అశ్విన్‌కు అనూహ్యంగా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ వన్డే మెగా టోర్నీలో యాష్‌కు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. కాగా, రవిచంద్రన్ అశ్విన్‌ను బౌలర్‌గానే దేశం గుర్తించిందని, బ్యాటర్‌గా అవకాశాలు ఇవ్వలేకపోయిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇది అతన్ని తీవ్రంగా నిరాశకు గురించేసిందని పేర్కొన్నాడు.

''అశ్విన్.. నీకు ఎన్నో విషయాల్లో శుభాకాంక్షలు చెప్పాలి. 100 టెస్టులు, 500 వికెట్లు ఎన్నో ఘనతలు సాధించావు. అయితే నీ కెరీర్ పట్ల ఓ నిరాశ ఉంది. నీ బ్యాటింగ్ సామర్థ్యాన్ని దేశం చూడలేకపోయింది, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో. గతంలో చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పాను. అశ్విన్ 4, 5 లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలని. బంతితో నీ సామర్థ్యాన్ని చూసిన భారత్, బ్యాటుతో నైపుణ్యాన్ని చూసే అవకాశం రాలేదు'' అని గంభీర్ అన్నాడు.

దీనికి అశ్విన్ సరదాగా స్పందించాడు. యువకుడిగా ఉన్న సమయంలో తనకి బ్యాటింగ్ సామర్థ్యం అంతగా లేదేమో అని, కాలంతో పాటు బ్యాటింగ్‌లో మెరుగయ్యానని అన్నాడు. టెస్టు కెరీర్‌లో అయిదు సెంచరీలు చేసిన యాష్ 36 సార్లు అయిదు వికెట్లను సాధించాడు. 26 సగటుతో 3309 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 707, టీ20ల్లో 184 పరుగులు తీశాడు.

Story first published: Tuesday, May 21, 2024, 9:01 [IST]
Other articles published on May 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+