Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ క్రికెట్ టీం ప్రధాన కోచ్‌గా భారతీయుడు

India Former Player Sridharan Sriram Appointed As Head Coach To Bangladesh Team

యూఏఈలో జరగనున్న ఆసియా కప్ అలాగే ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను ఆ దేశ బోర్డు నియమించింది. బంగ్లాదేశ్‌లోని 'ది డైలీ స్టార్' అనే ప్రముఖ న్యూస్ పేపర్లో ఈ మేరకు ఓ వార్త ప్రచురించింది. బీసీబీ డైరెక్టర్‌ వర్షన్ ప్రకారం.. టీ20 ప్రపంచకప్ వరకు శ్రీధర్ శ్రీరామ్‌ను మేం మా కోచ్‌గా ఎంచుకున్నాం' అని పేర్కొన్నాడు. 'మేం సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నందున.. కొత్త కోచ్‌ను ఆసియా కప్ నుంచి జట్టు తరఫున చూడొచ్చు. టీ20 ప్రపంచ‌కప్ మా ప్రధాన లక్ష్యం కాబట్టి.. ఆసియా కప్ నుంచే శ్రీధరన్ శ్రీరామ్ బాధ్యతలు చేపడితే అతనికి అలవాటు పడటానికి కొంత సమయం దొరుకుతుందనేది మా ఆలోచన.' అని ఉటంకించాడు.

ఇకపోతే శ్రీధరన్ శ్రీరామ్ 2000 మరియు 2004 మధ్య ఎనిమిది వన్డేలలో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. చాలా కాలం పాటు ఆస్ట్రేలియా అసిస్టెంట్ మరియు స్పిన్-బౌలింగ్ కోచ్‌ పనిచేశాడు. 2016లో ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెమన్ ఆధ్వర్యంలో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ ఎంపికవ్వడంతో ఆస్ట్రేలియా స్పిన్ కోచ్ పదవి నుంచి అతను వైదొలిగాడు. బంగ్లాదేశ్ వైట్ బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా శ్రీరామ్ ఎంపికయినప్పటికీ.. దక్షిణాఫ్రికా ప్లేయర్ రస్సెల్ డొమింగో టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నాడు. నవంబర్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ఆడనున్నందున ప్రస్తుతానికి టెస్టు జట్టుకు మార్గనిర్దేశం చేయడంలో డొమింగో తన పాత్రను కొనసాగిస్తాడని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Friday, August 19, 2022, 15:57 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+