
టీమిండియా గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఓ బీచ్‌లో గాయపడిన పక్షికి సపర్యలు చేసి, దాని ప్రాణాన్ని కాపాడాడు. దీంతో సచిన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఓ బీచ్‌లో గాయపడిన పక్షి సచిన్ కంట పడింది. దీంతో ఆ పక్షిని చేరదీసిన సచిన్, దానికి నీళ్లు తాపి, ఆహారం కూడా పెట్టాడు. అలా గాయపడిన ఆ పక్షిని సచిన్ కోలుకునేలా చేశాడు. ఈ వీడియోను సచిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనం చూపించే కాస్తంత ప్రేమ, అప్యాయత ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తుందని ఆ వీడియోకు సంబంధించిన పోస్టులో సచిన్ రాసుకొచ్చాడు. కాగా సచిన్ చేసిన ఈ పనిపై అభిమానులతోపాటు నెజిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
2013లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. రిటైర్మెంటై దాదాపు 10 సంవత్సరాలు గడిచినప్పటికీ సచిన్‌కు క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న ఆటగాళ్లలో సచిన్ ఎప్పుడూ ముందుంటున్నాడు. ఇక ఇండియాలో అయితే సెలబ్రెటీల్లో ఇప్పటికీ సచిన్ క్రేజ్ తగ్గడం లేదు. గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితాలో సచిన్ నిత్యం టాప్‌లో ఉంటున్నాడు. అటు క్రికెట్ మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో సైతం టెండూల్కర్ లేకపోయినప్పటికీ అభిమానులు సచిన్.. సచిన్.. అంటూ ఇప్పటికే అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే సచిన్ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
ఇక సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ఈ సారి కూడా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మెగా వేలంలో ముంబై అతడిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. గతేడాది కూడా ముంబై ఇండియన్స్ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో అర్జున్‌కు ఈ సారైనా ఆడే అవకాశం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా అర్జున్ టెండూల్కర్ పేస్ ఆల్‌రౌండర్ అనే సంగతి తెలిసిందే.