30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ: టీమిండియాతో టెస్టు సిరీస్‌లో తలపడుతోన్న ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ను తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆసీస్ ఫాలోఆన్ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1988లో సొంత గడ్డపై చివరిసారి ఇదే సిడ్నీ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక విదేశాల్లో 2005లో చివరగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్ పరాజయం పాలైంది.

ఫాలో ఆన్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
దాంతో పాటుగా భారత్‌కు ఆసియా వెలుపల అత్యల్ప టార్గెట్‌తో ఫాలో ఆన్ ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గ్రాస్ లెట్ వేదికగా 2006వ సంవత్సరంలో వెస్టిండీస్ 373 పరుగుల వద్ద, లీడ్స్ వేదికగా 2002వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌కు 355 పరుగుల వద్ద, నార్త్ సౌండ్ వేదికగా 20196వ సంవత్సరంలో 323 పరుగుల వద్ద, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 2018/19లో ఆస్ట్రేలియాకు 322 పరుగుల వద్ద, ఓవల్ స్టేడియం వేదికగా 2007వ సంవత్సరంలో 319 పరుగుల వద్ద, కింగ్‌స్టన్ స్టేడియం వేదికగా 2016వ సంవత్సరంలో 304 పరుగుల వద్ద వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

322 పరుగుల భారీ ఆధిక్యంలో
తాజా టెస్ట్‌లో వరణుడు పదే పదే అడ్డుపడటంతో మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ కావడంతో పర్యాటక జట్టుకు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. వర్షం అంతరాయంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యం
ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. వరుణుడు కరుణిస్తే భారత్ విజయం దాదాపు ఖాయమే. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లిసేన.. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ సొంతం చేసుకోనుంది. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications