Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS AUS Semifinal : అతడిని ఔట్ చేసేందుకు భారత ఫ్యాన్స్ చేతబడి పూజలు!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరుగుతోన్న కీలక సెమీఫైనల్ పోరులో అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా - టీమిండియా తలపడుతున్నాయి. మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్ ఆచితూచి చేస్తోంది. ఆసీస్ బ్యాటర్లు జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ బలమైన భాగస్వామ్యం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలానే ప్రత్యర్థి బ్యాటర్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు కాస్త కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. బ్రేక్ థ్రో సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆసీస్ ఓడాలని చేతబడి పూజలు..
ఇదే సమయంలో ఆసీస్ ను ఓడించాలని భారత క్రికెట్ అభిమానులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు భారత్ గెలవాలని పలువురు ప్రార్థనలు చేస్తుంటే.. మరోవైపు ఇంకొంత ఆసీస్ ఓడిపోవాలని పూజలు చేస్తున్నారు. చేతబడి, క్షుద్రపూజలు చేస్తున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ త్వరగా పెవిలియన్ చేరాలని కోరుకుంటూ.. బ్లాక్ మ్యాజిక్ లాంటి పూజలు చేస్తున్నట్లు ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.

India fans black magic prayers for travis head in ind vs aus champions trophy 2025 semifinal

రెండు సార్లు తప్పించుకున్న అతడు..
కానీ ట్రావిస్ హెడ్ అదృష్టాన్ని జేబులో పెట్టుకుని ఆడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు ఈ మ్యాచ్ లో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి రనౌట్, రెండో సారి క్యాచ్ మిస్ తో తప్పించుకున్నాడు. అతడు ఒక్కసారి క్రీజులో సరిగ్గా కుదుర్చుకుంటే ఆసీస్ భారీ స్కోర్ చేయడానికి బలమైన పునాది పడుతుంది. అందుకే అతడు పెవిలియన్ చేరాలని అంతా బలంగా కోరుకుంటున్నారు.

ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తి
జోరు మీదున్న ట్రావిస్ హెడ్ ను (39)ను పెవిలియన్ కు పంపాడు వరుణ్ చక్రవర్తి. బౌలింగ్ కు వచ్చీ రాగానే రెండో బంతికే వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

తుది జట్లు:

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్(కీపర్), మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్,

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, కూపర్ కొన్నోలీ, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్ వెల్, అలెక్స్ కారీ, బెన్ డ్వారాషూస్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘ.

Story first published: Tuesday, March 4, 2025, 15:24 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+