
పేలవంగా కనిపిస్తోన్న ధావన్ రికార్డు:
టెస్టు స్పెషలిస్ట్ అయిన విజయ్ బరిలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా.. అతడికి జతగా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టుల్లో ధావన్ రికార్డ్ పేలవంగా ఉంది. ఆరు ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 122 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 37 మాత్రమే. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన ధావన్.. వన్డేల్లో మాత్రం వరుసగా 40, 36, 44 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

తొలి టెస్టుకు సిద్ధమవుతోన్న కేఎల్ రాహుల్:
మరోవైపు చక్కటి ప్రదర్శన ఇచ్చేందుకు కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ గడ్డ మీద తొలి టెస్టు ఆడనున్న క్రమంలో.. ఆతురతగా ఎదురుచూస్తున్నాడు. తొలి టీ20లో సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన ఈ ఆటగాడు.. మిగతా మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటి వరకూ 34 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఈ బెంగళూరు బ్యాట్స్‌మెన్ 43.58 సగటుతో 1438 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

భాగస్వామ్యంలోనూ చక్కగా రాణించే విజయ్:
ఓపెనింగ్ భాగస్వామ్యం విషయానికి వస్తే.. విజయ్, ధావన్ కలిసి 39 ఇన్నింగ్స్‌ల్లో 44.18 సగటుతో 1678 పరుగులు చేశారు. విజయ్, రాహుల్ కలిసి 20 ఇన్నింగ్స్‌ల్లో తొలి వికెట్‌కు 471 పరుగులు జోడించారు. ధావన్, రాహుల్ జోడి 9 ఇన్నింగ్స్‌ల్లోనే 581 పరుగులు చేశారు. కానీ వీరిద్దరూ ఇంత వరకూ ఆసియా, వెస్టిండీస్ వెలుపల ఓపెనర్లుగా కలిసి ఆడలేదు. దీంతో ఈ ముగ్గురిలో ఎవర్ని ఓపెనర్లుగా పంపాలనే విషయం కోహ్లికి తలనొప్పిగా మారింది.

ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో...:
అశ్విన్, జడేజా, కుల్దీప్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టిన కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవడం కోసం అశ్విన్‌ను పక్కనబెట్టేందుకు కోహ్లి సాహసిస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications

