Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్ ముంగిట కివీస్, బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్‌లు

World Cup 2019 : India's Warm Up Matches For ICC World Cup 2019 | Oneindia Telugu
India to face New Zealand, Bangladesh in 2019 ICC World Cup warm-up matches

హైదరాబాద్: ఈ ఏడాది టీమిండియా బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడు టీ20ల సిరిస్ అనంతరం స్వదేశానికి తిరిగిరానుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆ తర్వాత మార్చిలో ఐపీఎల్.

ఐపీఎల్ ముగిసిన వెంటనే వన్డే వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు బయల్దేరనుంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ముందు జట్లన్నీ రెండు అధికారిక వార్మప్‌ మ్యాచ్‌లు ఆడతాయి.

టోర్నీలో పాల్గొనే దేశాలు రెండు వేర్వేరు జట్లతో ఆడుతాయని ఇప్పటికే ఐసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్ కప్‌లో కోహ్లీసేన న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. మే 25న ఓవల్‌లో న్యూజిలాండ్‌తో మే 28న కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

సుమారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వార్మప్ మ్యాచ్‌లకు ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్, కార్డిఫ్, హాంప్‌షైర్, ఓవల్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. 50 ఓవర్ల పాటు జరిగే ఈ మ్యాచ్‌లకు వన్డే హోదా మాత్రం ఉండదు. 15 మందిని బరిలోకి దించొచ్చు. వార్మప్‌ మ్యాచ్‌లను స్థానిక ప్రేక్షకులు చూసి ఆస్వాదించేందుక ఐసీసీ వీలు కల్పించింది.

Story first published: Friday, February 1, 2019, 12:45 [IST]
Other articles published on Feb 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+