IND VS NZ: ఫైనల్‌లో స్పిన్ ఎటాక్ - తిప్పేస్తే కప్ మనదే!!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తర సమరానికి వేళైంది. దుబాయ్ వేదికగా ఈ తుది పోరు జరగనుంది. అయితే దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. ఫైనల్ లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించే అవకాశముంది. స్పిన్నర్ల విషయంలో భారత్ కు దీటుగా ఉంది న్యూజిలాండ్. కాబట్టి రెండు జట్ల స్పిన్నర్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయమనేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు భారత జట్టు స్పిన్నర్లు ఏ విధంగా రాణించారో ఓ సారి నెమరువేసుకుందాం..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో నలుగురు స్పిన్నర్లలో బరిలోకి దిగింది టీమిండియా. అనువజ్ఞుడైన ఆల్ రౌండర్ జడేజా, క్రాఫ్టీ ఫింగర్ స్పిన్నర్ అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, లైఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్‌తో బలంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నింటిలోనూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను గట్టిగానే కట్టడి చేశారు మన స్పిన్నర్లు. అందుకే ఫైనల్ కోసం స్పిన్నే ప్రధాన అస్త్రంగా భారత జట్టు సిద్ధమైంది.

అక్షర్, జడ్డూ ప్రభావం..
రైట్ హ్యాండ్ బ్యాటర్లపై అక్షర్ పటేలా, రవీంద్ర జడేజా ఎక్కువ ప్రభావం చూపించారు. అక్షర్ విషయానికొస్తే 4 మ్యాచ్‌ల్లో 4.51 ఎకానమీతో 5 వికెట్లు దక్కించుకున్నాడు. పవర్ ప్లేలో తన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ తో బాగా ఎఫెక్ట్ చూపించాడు. జడేజా విషయానికొస్తే మధ్య ఓవర్లలో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా సెమీఫైనల్ లో చాలా బాగా ఆడాడు. అతడు 4 మ్యాచ్‌ల్లో 4.78 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు.
మిస్టరీ స్పిన్ తో చుక్కలే..
లెగ్‌స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. తన మిస్టరీ స్పిన్‌తో రెండు మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు. గ్రూప్ దశలో కేవలం 42 పరుగులకే 5 వికెట్లు తీసి చెలరేగాడు. కాబట్టి ఇతడిని ఫైనల్ లో ఎదుర్కోవడం కివీస్ కు కష్టమే.
ICC POSTER FOR TWO ICONIC BATTING UNIT IN CT 2025 🙇⚡ pic.twitter.com/wWcHYxmmr6
— Johns. (@CricCrazyJohns) March 8, 2025
ఆఖరి ఓవర్లో అతడే ఎక్కువ..
చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ తప్ప ఇతర స్పిన్నర్లు అంతా ఓవర్‌కు ఐదులోపే పరుగులివ్వడం మంచి విశేషం.కుల్‌దీప్ 4 మ్యాచ్‌ల్లో 5.01 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్లలో అతడు మంచిగా రాణించాడు. ఈ టోర్నీలోని ఆఖరి పది ఓవర్లలో ఎక్కువగా సేపు బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్ అతడే కావడం విశేషం. 10.3 ఓవర్లలో 5.52 ఎకానమీ రేట్‌తో 4 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications