Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీఫైనల్‌లో భారత్: కానీ హర్మన్‌ప్రీత్ కౌర్ బాధంతా ఆ ఒక్కదానిపైనే!

వరుసగా మూడు సతమతమైన భారత మహిళా క్రికెట్ జట్టు.. తమ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్ జట్టుపై 53 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నమెంట్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది. స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122)ల చారిత్రక బ్యాటింగ్ ప్రదర్శన ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ఉత్సాహభరితమైన విజయం తర్వాత కూడా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ విషయంలో మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

గెలుపు తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ ఆశ్చర్యకరమైన ప్రకటన
జట్టు కష్టపడి సెమీస్‌కు చేరినప్పటికీ.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బౌలింగ్ విభాగంలో మెరుగుదల లేకపోవడం బాధను కలిగించింది. గెలుపు అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శించిన అద్భుతమైన స్ఫూర్తిని, ముఖ్యంగా వరుస ఓటముల తర్వాత పుంజుకున్న తీరును అభినందించారు. స్మృతి, ప్రతికాలు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. కానీ ఆమె తన ప్రకటనలో ప్రధానంగా బౌలింగ్‌పై దృష్టి పెట్టారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, "మేము బ్యాటింగ్‌లో నిజంగా బాగా చేస్తున్నాం, కానీ బౌలింగ్ అనేది వ్యక్తిగతంగా నేను గట్టిగా ఉండాలని భావిస్తున్న విషయం. బౌలింగ్ యూనిట్‌గా కూడా మేము కలిసికట్టుగా వచ్చి మెరుగైన మార్గాన్ని చూపిస్తామని ఆశిస్తున్నాను." అని హర్మన్‌ప్రీత్ కౌర్‌ పేర్కొన్నారు.

India Enter Semifinals But Harmanpreet Kaur Concern Lies with Bowling

ఈ ప్రకటన వెనుక ఆంతర్యం
సెమీఫైనల్స్ వంటి కీలక మ్యాచ్ లకు ముందు టీమ్ కేవలం బ్యాటింగ్‌పైనే కాకుండా బౌలింగ్‌లో కూడా సమష్టిగా రాణించాలని కెప్టెన్ ఆకాంక్షిస్తోంది. ఇంత భారీ స్కోరు చేసినప్పటికీ న్యూజిలాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో 271 పరుగులు చేయగలిగింది. ఈ పరిస్థితిలోనే మరింత పటిష్టమైన బౌలింగ్ అవసరమని హర్మన్‌ప్రీత్ భావించింది. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో కేవలం బ్యాటింగ్‌పై ఆధారపడకుండా బౌలర్లు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆమె పరోక్షంగా సూచించింది. గెలిచిన వెంటనే కూడా ఇలాంటి అంశాన్ని లేవనెత్తడం, సెమీఫైనల్స్‌కు ముందు జట్టు ఎంత కఠినంగా సిద్ధమవుతుందో, లోపాలను ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో తెలియజేస్తుంది.

మ్యాచ్ హైలైట్స్:
భారత్ ఇన్నింగ్స్‌కు ప్రధాన బలం స్మృతి మంధాన (109), ప్రతికా రావల్(122)ల భాగస్వామ్యం. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించారు. ప్రతికా తన వరల్డ్ కప్ తొలి సెంచరీని నమోదు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (76*) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 49 ఓవర్లలో 340/3 భారీ స్కోరు చేయగలిగింది.వర్షం కారణంగా 44 ఓవర్లలో 325 పరుగుల సవరించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 271/8 మాత్రమే చేయగలిగింది. బ్రూక్ హాలిడే (81), ఇసాబెల్లా గేజ్ (65) పోరాడినా ఫలితం లేకపోయింది. తన అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మొత్తం మీద భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం సంతృప్తి చెందకుండా, బౌలింగ్ వైఫల్యాలను సరిదిద్దుకునే దిశగా దృష్టి సారించాలని పట్టుదలతో ఉన్నారు.

Story first published: Friday, October 24, 2025, 10:19 [IST]
Other articles published on Oct 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+