ఇంగ్లాండ్‌తో టీ20 సిరిస్: అశ్విన్, జడేజాలకు విశ్రాంతి
హైదరాబాద్: జనవరి 26 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20 సిరిస్‌కు టీమిండియా స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరిస్‌లో ఆడిన తరుణంలో వీరిద్దరికీ విశ్రాంతినిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

అశ్విన్, జడేజాలకు విశ్రాంతి
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు వీరి స్ధానంలో స్పిన్నర్లు అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్‌లకు చోటు కల్పించారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు అమిత్ మిశ్రాను ఎంపిక చేసినా, అతడు ఒక టెస్టు మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు.

అమిత్ మిశ్రాకు ఛాన్స్
ఆ తర్వాత సుదీర్ఘ ఇంగ్లాండ్ సిరిస్‌తో పాటు వన్డే సిరిస్‌లో కూడా మిశ్రాకు ఆడే అవకాశం దక్కలేదు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌లో అమిత్ మిశ్రాను పరీక్షించనున్నారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పర్వేజ్ రసూల్‌ను టీ20 సిరీస్‌లో ఎంపిక చేశారు.

రసూల్‌కు మరొకసారి అవకాశం
భారత్ తరపున ఒకే ఒక్క వన్డే ఆడిన ఈ ఆల్ రౌండర్ రసూల్‌కు మరొకసారి అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు మొగ్గు చూపడం విశేషం. 2014 జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు.

జనవరి 26 కాన్పూర్‌లో తొలి టీ20
మూడు టీ20 సిరిస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ కాన్పూర్‌లో జనవరి 26వ తేదీన ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగే సిరిస్‌కు ముందు టీమిండియా హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. బంగ్లా టెస్టు అనంతరం టీమిండియా ఆసీస్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications