మాటకు మాట: నాడు గంగూలీ×ఫ్లింటాఫ్, నేడు కోహ్లీ×స్టోక్స్
మొహాలి: క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్‌గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సెంచరీలు సాధించిన ఆటగాళ్లను మైదానంలోనే అభినందిస్తారు. అలానే మరికొన్ని సార్లు ఆటగాళ్లు దూషించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఐసీసీ కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం. తాజాగా మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ మధ్య ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకొంది.

స్టోక్స్ ఔట్ కాగానే భారత్ సంబరాలు
మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఔట్ కాగానే టీమిండియా సంబరాలు చేసుకుంది. స్టోక్స్ పెవిలియన్ వెళుతూ వెళుతూ భారత ఆటగాళ్లపై దురుసుగా ప్రవర్తించాడు. ఆగ్రహించిన కోహ్లీ వెంటనే స్టోక్స్‌ను ఏవో మాటలన్నాడు.

స్టోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ
దీంతో అంపైర్లు కలగజేసుకుని శాంతింపజేశారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. దీంతో ఫీల్డర్లు సంబరాలు చేసుకొంటుండగా స్టోక్స్ మాత్రం వెటకారంగా ‘నేను మాత్రం ఏమీ మాట్లాడను' అన్నట్లుగా స్టోక్స్ తన నోటిని చేతితో మూసుకొన్నాడు.

కోహ్లీ సైతం నోరుకు వేలు అడ్డం పెట్టుకొని ప్రతీకారం
తానేం తక్కువ కాదన్నట్లు సమయం కోసం వేచిచూసిన కోహ్లీ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఔట్ కాగానే కోహ్లీ సైతం నోరుకు వేలు అడ్డం పెట్టుకొని ప్రతీకారం తీర్చుకొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన చివరి ఓవర్లో బంతి స్టోక్స్ ప్యాడ్‌కు తగలడంతో అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించారు. దీనిపై కోహ్లి దీనిపై రివ్యూ కోరాడు.

ఫ్లింటాఫ్, గంగూలీ మధ్య కూడా ఇలాగే
ఫలితం భారత్‌కు అనుకూలంగా రావడంతో స్టోక్స్ పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో కోహ్లి తన పెదాలపై వేలితో మూసి తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. తాజాగా వీరిద్దరి వివాదం 2002లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, నాటి కెప్టెన్ గంగూలీ మధ్య వివాదాన్ని ఇది గుర్తుకు తెచ్చింది.

చొక్కా విప్పేసి వాంఖడేలో తిరిగిన ఫ్లింటాఫ్
అప్పట్లో నాయకత్వ లోపంతో బాధపడుతున్న టీమిండియాను గంగూలీ అప్పటి ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టుకు దీటుగా తయారుచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్లు స్లెడ్జింగ్ చేస్తే గంగూలీ కూడా అదే విధంగా వారిని ఎదురించేవాడు. 2002లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్, భారత్‌పై వన్డే సిరీస్ గెలవగానే చొక్కా విప్పేసి వాంఖడే మైదానమంతా తిరిగాడు.

లార్డ్స్ బాల్కానీలో చోక్కా విప్పేసి గంగూలీ ప్రతీకారం
ఆ తర్వాత జరిగిన నాట్ వెస్ట్ సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో అప్పటి కెప్టెన్ గంగూలీ క్రికెట్ పుట్టినిల్లుగా భావించే లార్డ్స్ బాల్కానీలో చోక్కా విప్పేసి ప్రతీకారం తీర్చుకొన్నాడు. ఇప్పుడు ఈ రెండు సందర్భాలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications