Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముగింపు అదిరింది: 4-0తో గెలుపు, టెస్టుల్లో మనమే టాప్

హైదరాబాద్: 2106 సంవత్సరానికి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0తో కైవసం చేసుకుని ఈ ఏడాదిని టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌తో ముగించింది. ఈ సిరిస్ విజయంతో 5 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా మొత్తం 120 పాయింట్లతో నెంబర్ వన్ జట్టుగా అవతరించింది.

మంగళవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో భారత్ 120 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. భారతకన్నా 15 పాయింట్లు వెనకున్న ఆస్ట్రేలియా (105) రెండో స్థానంలో ఉంది. చెరో 102 పాయింట్లను కలిగి ఉన్న పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మూడు, నాలుగు స్ధానాల్లో కొనసాగుతున్నాయి.

అయితే డెసిమల్ పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా కంటే స్వల్ప ముందంజలో ఉన్న పాకిస్తాన్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. భారత్‌తో సిరీస్‌ కోల్పోవడంతో ఇంగ్లాండ్ (101) పాయింట్లతో రెండోస్థానం నుంచి ఐదో స్ధానానికి దిగజారింది. ఈ ఏడాది అక్టోబర్‌లో స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో భారతకు నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ దక్కింది.

ఇక కటాఫ్‌ తేదీ అయిన ఏప్రిల్‌ 1, 2017 వరకు టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన జట్టు రూ. 6.8 కోట్ల ఫ్రైజ్‌ మనీ (10 లక్షల అమెరికా డాలర్ల) దక్కించుకోనుంది. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు 5 లక్షల డాలర్లు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు లక్ష డాలర్లు చొప్పున లభిస్తాయి.

India end 2016 as No. 1 Test team with 4-0 win over England

ర్యాంకు జట్టు పాయింట్లు
1. భారత్ 120 (+5)
2. ఆస్ట్రేలియా 105
3. పాకిస్థాన్ 102
4. దక్షిణాఫ్రికా 102
5. ఇంగ్లాండ్ 101 (-4)
6. న్యూజిలాండ్ 96
7. శ్రీలంక 96
8. వెస్టిండిస్ 69
9. బంగ్లాదేశ్ 65
10. జింబాబ్వే 05

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+