|
టాప్‌లో ఇంగ్లాండ్..
ఈ జాబితాలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌పై మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తరువాత ఆ జట్టు భారీ పాయింట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది. మొత్తం 125 పాయింట్లతో ఈ ఐసీసీ వన్డే సూపర్ లీగ్ స్టాండింగ్స్‌లో టాప్ పొటీషన్కు చేరుకుంది. ఇంగ్లాండ్ మొత్తం 18 వన్డేల్లో 18 పాయింట్లను అందుకుంది. తరువాత బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలచింది. 18 వన్డేలను ఆడిన బంగ్లాదేశ్ 120 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

ఆఫ్ఘన్.. పాకిస్తాన్
ఇప్పటివరకు 12 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 100 పాయింట్లను సాధించింది. ఈ సూపర్ లీగ్ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. దాని తరువాతి స్థానం పాకిస్తాన్‌దే. 15 వన్డేల్లో ఆడిన బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు 90 పాయింట్లను రికార్డు చేసింది. అయిదో స్థానాన్ని వెస్టిండీస్ దక్కించుకుంది. 21 మ్యాచ్‌లను ఆడిన కరేబియన్ క్రికెట్ టీమ్.. 80 పాయింట్లతో తొలి అయిదు స్థానాల్లో అడుగు పెట్టింది.
|
ఆరో స్థానంలో భారత్..
ఇక టీమిండియా టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయింది. ఆరో స్థానానికి దిగజారింది. 12 మ్యాచ్‌లల్లో భారత జట్టుకు లభించిన పాయింట్లు 79. ఆ తరువాత ఆస్ట్రేలియా-70, 68 పాయింట్లతో ఐర్లాండ్, 62 పాయింట్లతో శ్రీలంక, 60 పాయింట్లతో న్యూజిలాండ్ తొలి 10 దేశాల జాబితాలో ఉన్నాయి. చివరి మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్ ఉన్నాయి. దక్షిణాఫ్రికా-49, జింబాబ్వే-15, నెదర్లాండ్స్-25 పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి.

ఇంగ్లాండ్‌ను టాప్‌లో నిలిపిన నెదర్లాండ్స్ టూర్..
నెదర్లాండ్స్ పర్యటన ఇంగ్లాండ్ జట్టును బలోపేతం చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌లల్లో కలిపి నాలుగు సెంచరీలను నమోదు చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. తొలి వన్డేలో ఏకంగా 498 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ సెంచరీలు సాధించారు. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 36 ఓవర్లలోనే ఛేదించారు. ఓపెనర్లు జేసన్ రాయ్73, ఫిల్ సాల్ట్-77 పరుగులు చేశారు.

మూడో వన్డేలో అదే దూకుడు..
మూడో వన్డేలో మరో సెంచరీని నమోదు చేసింది ఇంగ్లాండ్. జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 86 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీ బాదాడు. జోస్ బట్లర్ మరోసారి విశ్వరూపాన్ని చూపించాడీ మ్యాచ్‌లో 64 బంతుల్లో 86 పరుగుల చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, అయిదు సిక్సర్లు కొట్టాడు. ఆమ్స్టెల్వీన్లో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.2 ఓవర్లల్లో 244 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 30.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.