Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళా టీ20 ప్రపంచకప్‌.. చెత్త రికార్డు నెలకొల్పిన హర్మన్‌సేన!!

India dropped 9 catches in womens t20 world cup


హైదరాబాద్: మహిళల క్రికెట్‌లో దేశానికి తొలి ప్రపంచకప్‌ అందించాలనుకున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఓటమెరుగని హర్మన్‌ సేన తుది పోరులో మాత్రం తడబడింది. ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో కీలకమైన రెండు క్యాచులు వదిలేయడంతో ఆసీస్ ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్‌ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్‌; 10 ఫోర్లు) భారీ స్కోర్లు చేసి తమ జట్టుకు సునాయాస విజయాలను అందించారు.
ప్రపంచకప్‌లో హర్మన్‌సేన చెత్త రికార్డు:

ప్రపంచకప్‌లో హర్మన్‌సేన చెత్త రికార్డు:

మహిళా టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌సేన ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. మెగాటోర్నీలో అత్యధిక క్యాచులు జారవిడిచిన జట్టుగా బంగ్లాదేశ్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తంలో భారత మహిళలు 9 క్యాచ్‌లు నేలపాలు చేసారు. మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా అన్నే క్యాచ్‌లు జారవిడిచింది. 'క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయి' అన్న క్రికెట్‌ సూత్రాన్ని ఈ రెండు జట్లు మరిచిపోయినట్టున్నాయి.

 అత్యల్పంగా వెస్టిండీస్‌ 3 మాత్రమే:

అత్యల్పంగా వెస్టిండీస్‌ 3 మాత్రమే:

హర్మన్‌సేన టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచులు జారవిడిచి తగిన మూల్యమే చెల్లిచుకుంది. కీలకమైన ఫైనల్లో జారవిడిచిన రెండు క్యాచులే హర్మన్‌సేన కొంపముంచాయి. దాంతో ఏకంగా కప్పే దూరమయింది. ఇక విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా 4 క్యాచులు మాత్రమే జారవిడిచింది. అత్యల్పంగా వెస్టిండీస్‌ 3 మాత్రమే వదిలేసింది. శ్రీలంక 8, పాకిస్థాన్‌ 6, ఇంగ్లాండ్‌ 6, దక్షిణాఫ్రికా 6, న్యూజిలాండ్‌ 5, థాయ్‌ల్యాండ్‌ 5 క్యాచులు జారవిడిచాయి.

షెఫాలీని నిందించలేం:

షెఫాలీని నిందించలేం:

'అలీసా హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షెఫాలీ వర్మ నేలపాలు చేసిందని ఆమెను నిందించలేం. 16 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్ ఆడుతున్న షెఫాలీ జట్టు కోసం గొప్పగా పోరాడింది. ఈ వయసులో అంత సానుకూల దృక్పథంతో ఆడడం ఎంతో కష్టం' అని హర్మన్‌ప్రీత్‌ కౌర్ తెలిపారు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షెఫాలీ జారవిడిచింది. ఆ తర్వాత ఆమె చెలరేగి 75 పరుగులు చేసింది.

 99 పరుగులకే ఆలౌట్:

99 పరుగులకే ఆలౌట్:

ఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. హేలీ, మూనీ చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్‌ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్‌ స్కారర్‌. ఆసీస్‌ బౌలర్లలో మేఘన్ షుట్‌ (4/18), జెస్‌ జొనాసెన్‌ (3/20) రాణించారు.

Story first published: Wednesday, March 11, 2020, 12:18 [IST]
Other articles published on Mar 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+