Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుర్రాళ్లు కుమ్మేశారు: అండర్ 19 ఆసియా విజేత భారత్

హైదరాబాద్: అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. శుక్రవారం శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్ 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

భారత్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభం

భారత్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభం

భారత్‌కు ఓపెనర్లు హిమాన్షు రాణా(71), పృథ్వీ షా (39) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగులు, రెండో వికెట్‌కు హిమాన్షు, శుభ్‌మన్‌ 88 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో హిమాన్షు రాణా, శుభమ్‌ గిల్‌ అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షా (39), కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (29), సల్మాన్‌ ఖాన్‌ (26) పరుగులతో రాణించారు.

గౌరవప్రదమైన స్కోరు చేసిన భారత్

గౌరవప్రదమైన స్కోరు చేసిన భారత్

చివర్లో నాగర్‌కోటి (14 బంతుల్లో 23) ధాటిగా ఆడడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. శ్రీలంక బౌలర్లలో రన్సిక, జయవిక్రమ చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.4 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఆరంభంలోనే చతురంగ (13) వికెట్‌ కోల్పోయింది.

కెప్టెన్ అభిషేక్‌ అద్భుతమైన ప్రదర్శన

కెప్టెన్ అభిషేక్‌ అద్భుతమైన ప్రదర్శన

అయితే కెల్లీ, బోయగోడ (37) రెండో వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అభిషేక్‌ బౌలింగ్‌లో బోయగోడ అవుట్‌ కాగా మూడో వికెట్‌కు కెల్లీ, మెండిస్‌ 53 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కెప్టెన్ అభిషేక్‌ తన బౌలింగ్‌లో విడదీశాడు. ఆ తర్వాత భారత్ దెబ్బకు శ్రీలంక కోలుకోలేకపోయింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా హిమాన్షు రాణా

‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా హిమాన్షు రాణా

గెలుపు కోసం 75 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన శ్రీలంక, 43 పరుగుల వ్యవధితో తమ చివరి 7 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. దీంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్‌ శర్మ (4/37) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలవగా టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+