Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకపై భారత్ ఘన విజయం

India
కాన్పూర్: రెండో టెస్టు మ్యాచులో భారత క్రికెట్ జట్టు శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించింది. శ్రీలంకపై భారత్ ఇన్నింగ్స్ 144 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ కు టెస్టు క్రికెట్ లో నూరో విజయం. చివరలో మొరాయించిన శ్రీలంక ఇద్దరు బ్యాట్స్ మెన్ ను అవుట్ చేయడం భారత బౌలర్లు నానా ఇబ్బందులు పడ్డారు. వికెట్ల వద్ద పాతుకుపోయిన అజంతా మెండిస్ ను యువరాజ్ సింగ్ 27 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో భారత్ విజయాన్ని అందుకుంది తద్వారా భారత్ టెస్టు సిరీస్ లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది. శ్రీలంక రెండో ఇన్నింగ్సులో 269 పరుగులు చేసింది.

సమరవీర భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నాడు. అయితే ఆయన ఒంటరి పోరు ఏ మాత్రం ఫలించలేదు. 78 పరుగుల వ్యక్తిగత స్కోరుతో నాటవుట్ గా మిగిలాడు. ముత్తయ్య మురళీథరన్ 29 పరుగులు, చణక వెలెగెదర నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు. హర్బజన్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా, ప్రజ్ఞాన్ ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. జహీర్, శ్రీశాంత్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లకు ఒక్కటేసి వికెట్లు లభించాయి. తొలి ఇన్నింగ్సులో భారత్ 642 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్సులో 229 పరుగులకే చేతులెత్తేసింది. రెండో ఇన్నింగ్సులో కూడా శ్రీలంక సరిగా ఆడలేకపోయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్సు స్కోరుతో ఆత్మస్థయిర్యం కోల్పోయినట్లు అనిపించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+