Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

566 పరుగుల వద్ద భారత్ డిక్లేర్: 373 పరుగుల ఆధిక్యం

India
నాగపూర్: భారత్ - న్యూజిలాండు మధ్య నాగపూర్ లో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్సును భారత్ 566 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భజ్జీ 20 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద అవుటవడంతో డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్సులో 193 పరుగులకే ఆలవుటయ్యింది. రైడర్ 59 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు భారత్ 373 పరుగుల భారీ ఆధిక్యంతో ఉంది. బౌలర్లు కివీస్ ను తొందరగా అవుట్ చేస్తే విజయం ఖాయమైనట్లే.

అంతకు ముందు కెప్టెన్ మహేంధ్రసింగ్ ధోని సెంచరీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 156 బంతులలో 98 పరుగులకు అవుటయ్యాడు. రాహుల్ ద్రావిడ్ సైతం తన డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. డబుల్ సెంచరీకి 9 పరుగుల దూరంలో 191 వద్ద అవుటయ్యాడు. ద్రావిడ్ 191, ధోనీ 98, గంభీర్ 78, సెహ్వాగ్ 74, సచిన్ 61, భజ్జీ 20 పరుగులు చేశారు. సచిన్ టెండుల్కర్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. సచిన్ సెంచరీల అర్థసెంచరీల కోసం భారత అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. 129 బంతుల్లో 61 పరుగులు చేసి అవుటయ్యాడు. సురేశ్ రైనా మరోసారి విఫలమయ్యాడు. కేవలం 3 పరుగులకే అవుటయి పెవిలియన్ దారి పట్టాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+