For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జహీర్ ప్రతిభ: బంగ్లాపై భారత్ విజయం

By Pratap
Zaheer Khan
మీర్పూర్: జహీర్ ఖాన్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ పై భారత్ రెండో టెస్టు మ్యాచును ఘనంగా గెలుచుకుంది. పది వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ టెస్టు మ్యాచులో జహీర్ ఖాన్ పది వికెట్లు తీసుకున్నాడు. ఒక మ్యాచులో పది వికెట్లు తీసుకున్న నాలుగో బౌలరుగా అతను రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్సులో మూడు వికెట్లు తీసుకున్న అతను రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఒక ఓవరులో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. మూడు వికెట్లకు 290 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగుకు దిగిన బంగ్లాదేశ్ ఆ తర్వాతి ఏడు వికెట్లను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. రెండో ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 312 పరుగులు చేసింది. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్సుపై ఒక పరుగు ఆధిక్యతను సాధించింది. దాంతో ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడింది.

విజయానికి కావాల్సిన రెండు పరుగులు చేయడానికి బ్యాటింగ్ కు దిగిన భారత్ బౌలర్ల వల్లనే ఆ రెండు పరుగులు రాబట్టి విజయం సాధించింది. బంగ్లా దేశ్ బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో ఆ రెండు పరుగులు ఇచ్చుకున్నారు. షాదత్ హుస్సేన్ 40 పరుగులు చేశాడు. మొహ్మద్ అష్రాఫుల్ 25 పరుగులకు అవుటయ్యాడు. తమీమ్ ఇక్బాల్ ధాటిగా ఆడి 151 పరుగులు చేశాడు. అతను భారత విజయాన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు. భారత బౌలర్ జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్సును 544 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు అలవుట్ అయింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+