Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ వీధుల్లో అనూష్క శ‌ర్మ‌! భ‌ర్త విరాట్‌తో క‌లిసి చ‌క్క‌ర్లు: మ‌రో సానియా మీర్జా అవుతుందా?

ICC World Cup 2019 : Anushka Sharma Joins Viarat Kohli In England Ahead Of Ind V Afg Clash
India cricket team captain Virat Kohli spotted in London with wife Anushka Sharma

లండ‌న్‌: బాలీవుడ్‌కు చెందిన‌ ప్ర‌ముఖ న‌టి అనూష్క శ‌ర్మ ఇటీవ‌లే లండ‌న్‌లో క‌నిపించారు. త‌న భ‌ర్త‌, టిమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీతో క‌లిసి లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఒక‌ట్రెండు ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్‌లో ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన రెండోరోజే అనూష్క శ‌ర్మ లండ‌న్‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్క‌డే ఉన్నార‌ని చెబుతున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆదివారం ముగిసింది. త‌న త‌దుపరి మ్యాచ్‌ను ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఎదుర్కోబోతంది టీమిండియా. ఆఫ్ఘ‌న్‌తో మ్యాచ్ హ్యాంప్‌షైర్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో శ‌నివారం జ‌రుగ‌నుంది.

షెడ్యూల్ ప్ర‌కారం..ఆరు రోజుల వ్య‌వ‌ధి ల‌భించ‌డంతో విరాట్ కోహ్లీ బీసీసీఐ అనుమ‌తి తీసుకుని అనూష్క శ‌ర్మ‌ను లండ‌న్‌కు పిలిపించుకున్న‌ట్లు చెబుతున్నారు. తదుప‌రి మ్యాచ్‌లో టీమిండియా ప్ర‌త్య‌ర్థి ఆప్ఘ‌నిస్తాన్ కావ‌డం వ‌ల్ల ఈ మ్యాచ్ కోసం ముందుగా జ‌ట్టు స‌భ్యులెవ‌రూ పెద్ద‌గా క‌స‌ర‌త్తు చేయ‌ట్లేద‌ని, రెండురోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నార‌ని టీమ్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ఇదివ‌ర‌కే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. జ‌ట్టు మొత్తం బుధ‌వారం నుంచి పూర్తిస్థాయిలో నెట్ ప్రాక్టీస్‌కు దిగుతుంద‌ని తెలుస్తోంది.

కాగా- భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి పాకిస్తాన్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ షోయ‌బ్ మాలిక్ త‌న భార్య‌, హైద‌రాబాద్‌కు చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయ‌ర్ సానియా మీర్జాతో క‌లిసి మాంఛెస్ట‌ర్‌లోని విల్‌స్లో రోడ్డులో ఉన్న 360 శీషా రెస్టారెంట్‌లో అర్ధ‌రాత్రి దాటి పోయేంత వ‌ర‌కూ పార్టీ చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై చెల‌రేగిన దుమారం ఇంకా త‌గ్గనే లేదు. ఈ ప‌రిస్థితుల్లో అనూష్క శ‌ర్మ లండ‌న్ వెళ్ల‌డం, భ‌ర్త‌తో క‌లిసి లండ‌న్ వీధుల్లో క‌నిపించ‌డం ప‌ట్ల అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అనూష్క మ‌రో సానియా మీర్జా అవుతారేమోన‌ని వ్యాఖ్యానిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Story first published: Wednesday, June 19, 2019, 12:49 [IST]
Other articles published on Jun 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+