
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య శనివారం (డిసెంబర్ 2)న చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

దీంతో చివరి టెస్టులో విజయం సాధించి టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో భారత క్రికెటర్లు తీవ్రంగా శ్రమించారు. కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మురళీ విజయ్, విజయ్ శంకర్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.
అంతక ముందు వీరంతా స్టేడియంలో పుట్ బాల్ ఆడారు. దీనికి సంబంధఇంచిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలా సాగుతుందనే దానిపై ఆసక్తికరంగా మారింది.
