2022లో బిజీ బిజీగా టీమిండియా.. ఏడాది మొత్తానికి షెడ్యూల్ ఫిక్స్

2021 సంవత్సరం ముగిసేందుకు మరొక రోజు మాత్రమే ఉండడంతో క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు 2022 గురించే చర్చించుకుంటున్నారు. 2022లో ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఆడనుంది. ఏ ఏ టీంలతో ఆడనుంది. వచ్చే ఏడాది ఏ ఏ టోర్నమెంట్లు జరగనున్నాయని ఆరా తీస్తున్నారు. నిజానికి ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు ఏం టీంతో ఎక్కడ మ్యాచ్‌లు ఆడనుందో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో 2022లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు వైరల్‌గా మారాయి.

భారత పర్యటనకు వెస్టిండీస్
ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా సిరీస్ జనవరి 23తో ముగియనుంది. అనంతరం వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్య ఇరు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్, 3 టీ20ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 15, 18, 20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 18న జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖపట్నం వేదికగా నిల్వనుంది.

భారత పర్యటనకు శ్రీలంక
ఫిబ్రవరి నెల చివరి వారం శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 మధ్య బెంగళూరు వేదిక తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. మార్చి 5 నుంచి 9 మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మార్చి 13, 15, 18 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఏప్రిల్, మేలో ఐపీఎల్
ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ 2022 సీజన్ జరగనుంది. 2011 తర్వాత ఐపీఎల్ మళ్లీ ఈ సారి 10 జట్లు పాల్గొననున్నాయి. కరోనా కారణంగా గత సంవత్సరం సెకండాఫ్ యూఏఈలో జరగగా ఈ సారి ఇండియాలోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 13, 14 తేదీల్లో మెగా వేలం నిర్వహించనున్నట్లు సమాచారం.

భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన
జూన్ నెలలో సౌతాఫ్రికా టీం భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య జూన్ 9 నుంచి 19 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. జూన్ 9, 12, 14, 17, 19 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంగ్లండ్ పర్యటనకు భారత్
జూలైలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 1 నుంచి 17 వరకు అక్కడే మ్యాచ్‌లు ఆడుతుంది. అక్కడ జూలై 1 నుంచి 5 మధ్య గతంలో వాయిదా పడ్డ టెస్ట్ మ్యాచ్‌ను ఆడనుంది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడతాయి. జూలై 7, 9, 10న మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 12, 14, 17న మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

సెకండాఫ్‌లో కీలక టోర్నమెంట్లు
జూలైలో ఇంగ్లండ్‌లో ఉండనున్న భారత జట్టు ఆ నెల చివరలో అటు నుంచి అటే వెస్టిండీస్ వెళ్తుంది. వెస్టిండీస్‌లో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే 2022 సెకండాఫ్‌లో టీమిండియా పలు కీలక టోర్నమెంట్లలో పాల్గొననుంది. సెప్టెంబర్‌లో ఆసియా కప్‌లో పాల్గొంటుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది.
ఈ పర్యటనలో 4 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్, నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. అనంతరం నవంబర్, డిసెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్ పర్యటనతో 2022 ముగియనుంది. ఇలా 2022లో వరుస మ్యాచ్‌లతో భారత జట్టు బిజీబిజీగా గడపనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications