Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India: 4 టెస్టులు, 4 టీ20లు, 3 వన్డేలు.. జులైలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

India Cricket Schedule July 2025: జులైలో భారత క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్, ప్రతి మ్యాచ్ తేదీ, వేదిక, సమయ వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో పురుషుల జట్టు జులై 2 నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇది బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతుంది. మహిళల క్రికెట్ జట్టు విషయానికొస్తే.. వారు ఇంగ్లండ్ జట్టుతో రెండో టీ20 ఆడనున్నారు.

ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టు, మహిళల జట్లు ఇంగ్లండ్‌లోనే ఉన్నాయి. పురుషుల జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC 2025-27) సైకిల్‌లో భాగంగా తమ మొదటి సిరీస్ ఆడుతుండగా.. మహిళల జట్టు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. దీని తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఇది రాబోయే ప్రపంచకప్ నేపథ్యంలో చాలా ముఖ్యమైనది.

India Cricket Schedule July 2025 Men s and Women s Teams Complete Fixtures for July Matches Against England

భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

*జులై 2 నుండి 6: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్ట్
వేదిక: ఎడ్జ్‌బాస్టన్
సమయం: మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభం

*జులై 10 నుండి 14: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్
వేదిక: లార్డ్స్
సమయం: మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభం

*జులై 23 నుండి 27: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్ట్
వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
సమయం: మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభం

*జులై 31 నుండి ఆగస్టు 4: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్ట్
వేదిక: ది ఓవల్
సమయం: మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభం

భారత మహిళల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇలా..

*మంగళవారం, జులై 1: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టీ20 మ్యాచ్
వేదిక: సీట్ యూనిక్ స్టేడియం
సమయం: రాత్రి 11:00 గంటలకు

*శుక్రవారం, జులై 4: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20
వేదిక: ది ఓవల్
సమయం: రాత్రి 11:05 గంటలకు

*బుధవారం, జులై 9: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టీ20
వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
సమయం: రాత్రి 11:00 గంటలకు

*శనివారం, జులై 12: భారత్ vs ఇంగ్లండ్ ఐదో టీ20
వేదిక: ఎడ్జ్‌బాస్టన్
సమయం: రాత్రి 11:05 గంటలకు

భారత మహిళల వన్డే మ్యాచ్ సిరీస్ షెడ్యూల్ ఇలా..

*బుధవారం, జులై 16: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మొదటి వన్డే
వేదిక: ది ఏజియాస్ బౌల్
సమయం: సాయంత్రం 5:30 నుండి ప్రారంభం

*శనివారం, జులై 19: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో వన్డే
వేదిక: లార్డ్స్
సమయం: మధ్యాహ్నం 3:30 నుండి

మంగళవారం, జూలై 22: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో వన్డే
వేదిక: రివర్‌సైడ్ గ్రౌండ్
సమయం: సాయంత్రం 5:30 నుండి ప్రారంభం

భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల లైవ్ ప్రసారం, స్ట్రీమింగ్ వివరాలు ఇలా..
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ పురుషుల జట్టు మ్యాచ్‌ల లైవ్ ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్‌లో ఉంటుంది.

భారత మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల లైవ్ ప్రసారం, స్ట్రీమింగ్ వివరాలు ఇలా..
భారత మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల లైవ్ ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్‌లో ఉంటుంది.

Story first published: Monday, June 30, 2025, 15:22 [IST]
Other articles published on Jun 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+