Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట్స్‌మెన్ విఫలం: తొలి టెస్టు ఓటమికి వారిద్దరే బాధ్యులా!

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన దక్షిణాఫ్రికా చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో బౌలర్లు రాణించినప్పటికీ, బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత జట్టు ఓటమి పాలైంది. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం తుది జట్టులో చోటు దక్కించుకున్నందున శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో శిఖర్ ధావన్ ఔటైన తీరు అలా అనేలా చేసింది.

 ధావన్ ఔటైన తీరుపై సందేహాలు

ధావన్ ఔటైన తీరుపై సందేహాలు

ముఖ్యంగా షార్ట్‌ బంతులను పుల్‌ చేయబోయి అవుటైన ధావన్‌ విదేశీ గడ్డపై తన సామర్థ్యంపట్ల అటు అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకుల్లో సందేహాలు రేకెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే పొరపాటున జరిగిందని అనుకుంటే, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరుగా పెవిలియన్‌కు చేరడం విమర్శలకు తావిచ్చింది. నిజానికి ధావన్ ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ కావడం... ప్రత్యర్థి బౌలర్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను దెబ్బ తీసేందుకు అతడు ఓ సాధనంగా పనికొస్తాడని కోహ్లీ భావించి తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ స్ధానంలో ధావన్‌కి చోటు కల్పించాడు.

 కోహ్లీ నమ్మకాన్ని వమ్ముచేసేలా ధావన్ బ్యాటింగ్

కోహ్లీ నమ్మకాన్ని వమ్ముచేసేలా ధావన్ బ్యాటింగ్

అయితే కోహ్లీ నమ్మకాన్ని వమ్ముచేసేలా ధావన్ బ్యాటింగ్ తీరు సాగింది. మరోవైపు స్వదేశంలో డబుల్ సెంచరీతో పాటు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ సఫారీ బౌలర్ల ముందు తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌన్సర్లను ఎదుర్కొనేందుకు నానా ఇబ్బందులు పడిన రోహిత్... రెండో ఇన్నింగ్స్‌లో తానెంటే నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం రహానే స్ధానంలో రోహిత్ శర్మను ఎందుకు తీసుకున్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు గాను కోహ్లీ సైతం తెల్లముఖం వేశాడు.

టెస్టుల్లో జట్టును నిలబెట్టేవి భాగస్వామ్యాలే

స్వదేశంలో ఆతడి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని తుది జట్టులో చోటు కల్పించామని చెప్పడం విశేషం. తొలి టెస్టు ఓటమిలో భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి టెస్టుల్లో జట్టును నిలబెట్టేవి భాగస్వామ్యాలే. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌-డుప్లెసిస్‌ల 114 పరుగులు, డికాక్‌-కేశవ్‌ మహరాజ్‌ల 60 పరుగుల భాగస్వామ్యం ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిందని చెప్పాలి. ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ డివిలియర్స్‌ మరో ఎండ్‌లో కేశవ్‌ మహారాజ్‌తో 27 పరుగులు జోడించాడు.

 భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం

భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం

అయితే భారత బ్యాట్స్‌మెన్ మాత్రం ఇలా చేయడంతో పూర్తిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడో వికెట్‌కు గాను 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పతే, రెండో రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు 49పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా లోయర్‌ ఆర్డర్‌లోనే నమోదు కావడం విశేషం.

Story first published: Wednesday, January 10, 2018, 11:04 [IST]
Other articles published on Jan 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+