Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టీ20లో భారత్ ఓటమి: భారత్ ఖాతాలో చెత్త రికార్డు

India crash to their worst T20I defeat after horror show against New Zealand

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది.

దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ టీ20ల్లో ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల తేడాతో ఓడిన చెత్త రికార్డును నమోదు చేసింది. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడు ఆ రికార్డుని 80 పరుగులతో ఓడి టీమిండియా అధిగమించింది.

1
44085

1-0 ఆధిక్యంలో నిలిచిన న్యూజిలాండ్

మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్‌‌‌లో ధోని (39), ధావన్‌(29), విజయ్‌ శంకర్‌(27), కృనాల్‌(20)లు రాణించడంతో టీమిండియా కనీసం ఈ స్కోరునైనా చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

220 పరుగుల లక్ష్యంతో

220 పరుగుల లక్ష్యంతో

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్‌ శర్మ(1) దారుణంగా విఫలమయ్యాడు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.

క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిన శిఖర్ ధావన్

క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిన శిఖర్ ధావన్

కానీ కివీస్‌ బౌలర్‌ ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌(29) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్‌ పెంచే క్రమంలో ఒత్తిడికి గురైన ఆల్ రౌండర్ విజయ్‌ శంకర్‌(27) కూడా క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.

139 పరుగులకే ఆలౌట్

139 పరుగులకే ఆలౌట్

ధోనితో కలిసి దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్‌ పాండ్యా(20) కూడా కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, చివర్లో ధోని(39), భువనేశ్వర్‌(1), చాహల్‌(1)లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా 139 పరుగులకే ఆలౌటైంది. తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు నిరాశ చెందారు.

Story first published: Wednesday, February 6, 2019, 16:56 [IST]
Other articles published on Feb 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+