Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ప్రధాన కోచ్ ఉద్యోగం: రవిశాస్త్ర Vs విదేశీ కోచ్‌లు

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పదవికి ఎవరికి దక్కుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు జులై 9 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ పదవికి అర్హులైన అభ్యర్దులు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, ఫిల్‌ సిమన్స్‌, రిచర్డ్‌ ఫైబస్‌, దొడ్డా గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ తదితరులు కూడా కోచ్ రేసులో ఉన్నారు.

దీంతో కోచ్ పదవి రేసులో అందరి కంటే రవిశాస్త్రి ముందున్నాడని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పాడు. మరికొందరు రవిశాస్త్రికి కెప్టెన్ కోహ్లీ మద్దతు ఉందని, కాబట్టి కోచ్‌ పదవి రవిశాస్త్రికే దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. కానీ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయాలు మాత్రం వేరేలా ఉన్నాయి. రవిశాస్త్రి-విదేశీ కోచ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టామ్ మూడీ

టామ్ మూడీ

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకి కోచ్‌గా బాధ్యతలు అందించాడు. అంతేకాదు శ్రీలంక జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా ఏళ్లు కొనసాగిన టామ్‌ మూడీకి అపారమైన అనుభవం ఉంది. ఐపీఎల్‌ ద్వారా భారత ఆటగాళ్లను మూడీ ప్రత్యక్షంగా గమనించిన అనుభవం కూడా ఉంది. కాబట్టి టీమిండియా ప్రధాన కోచ్ పదవికి టామ్ మూడీ కూడా అర్హుడని అంటున్నారు.

ఫిల్ సిమన్స్

ఫిల్ సిమన్స్

వెస్టిండిస్‌కు చెందిన ఫిల్ సిమన్స్ విండీస్‌ జట్టు టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో ఫిల్‌ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు కోచ్‌గా సిమన్స్‌కు మంచి రికార్డు ఉంది. ఐర్లాండ్‌ జట్టుకి ఎనిమిదేళ్లపాటు సిమన్స్‌ కోచ్‌గా సేవలందించాడు. 2011, 15 జరగిన వరల్డ్ కప్‌‌లలో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వేపై ఐర్లాండ్ విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2016లో వెస్టిండీస్‌ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. సిమన్స్‌ ఆధ్వర్యంలో ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

రిచర్డ్‌ పైబస్‌

రిచర్డ్‌ పైబస్‌

ఇక దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్‌ పైబస్‌ విషయానిక వస్తే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లకు పైబస్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు దేశాలకు చెందిన జాతీయ సర్క్యూట్‌లోని జట్లకు పైబస్‌ పని చేశాడు. పైబల్ హయాంలో జట్లు కీలక విజయాలు సాధించాయి. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో పైబస్‌కు తనదైన ప్రత్యేకత ఉంది. దీంతో రవిశాస్త్రికి విదేశీ కోచ్‌ల నుంచి పోటీ తీవ్రంగానే ఉండవచ్చని అంటున్నారు.

రవిశాస్త్రి

రవిశాస్త్రి

ఇక రవిశాస్త్రి విషయానికి వస్తే గతంలో టీమిండియా మాజీ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అంతేకాదు రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు కూడా ఉంది. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ జులై 10న దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్‌ ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు. స్వదేశీయులకే కోచ్‌ పదవిని కట్టబెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. మరి చివరికి కోచ్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+