
హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికచేయబోయే వ్కక్తికి ఏయే లక్షణాలు ప్రధానంగా పరిశీలిస్తామనే దానిపై క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడిగా ఉన్న అన్షుమన్ గైక్వాడ్ స్పష్టతనిచ్చారు. మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌ని ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ కమిటీలో కపిల్ దేవ్‌తో పాటు మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీనే హెడ్ కోచ్‌ని ఎంపిక చేయనుంది. కోచ్‌ల దరఖాస్తులకు తుది గడువుని జులై 30గా బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో గైక్వాడ్ మాట్లాడుతూ క్రికెటర్లను సమన్వయ పరుస్తూ జట్టును ఎవరైతే ముందు తీసుకెళ్తారని భావిస్తామో వారికే అధిక ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు.
రెండు అంశాలు టీమిండియా కోచ్‌కు అత్యంత అవసరమని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మంచి ప్రణాళికతో పాటు ఆటగాళ్లను సమన్వయంతో ముందుకు నడిపించే వ్యక్తే టీమిండియా కోచ్‌గా అవసరం. ఈ రెండు లక్షణాలు కోచ్‌ను ఎంపిక చేసే క్రమంలో ముఖ్యంగా పరిశీలిస్తాం" అని అన్నారు.
"దీంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి సరైన ప్రణాళికతో ఉన్నాడా? లేడా అని కూడా అర్థమవుతుంది" అని అన్షుమన్ గైక్వాడ్ అన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు మహేళా జయవర్దనేతో పాటు గ్యారీ కిర్‌స్టన్, టామ్ మూడీ, మైక్ హెస్సన్, రాబిన్ సింగ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.
ఆగస్టు 13 లేదా 14న హెడ్ కోచ్‌తో పాటు మిగతా సిబ్బందికి క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కాగా, విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టు 3న ప్రారంభయ్యే ఈ పర్యటన సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.