టీమిండియా అసిస్టెంట్ కోచ్‌ల గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యపోయానని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. సహాయక సిబ్బంది గురించి గంభీర్ కొన్ని పేర్లు ప్రతిపాదించగా, వాటిని బీసీసీఐ అంగీకరించలేదని జాతీయ మీడియాలో ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దానిపై గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రత్యేకంగా ఓ విభాగానికి మాత్రమే కాకుండా, అన్ని విభాగాల్లో సహాయ పడే అసిస్టెంట్ కోచ్‌లను ఎంచుకున్నానని గంభీర్ తెలిపాడు. తాను ప్రతిపాదించిన సహాయక సిబ్బందికి బీసీసీఐ సానుకూలంగానే స్పందించి అంగీకరించిందని పేర్కొన్నాడు. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డొస్చేట్‌లను అసిస్టెంట్ కోచ్‌లుగా, ఇక ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ను కొనసాగిస్తున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు.

''బీసీసీఐ నిర్ణయాలతో సంతోషంగా ఉన్నాను. నేను అడిగిన విషయాలను దాదాపు అంగీకరించింది. కానీ నా అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించిందన్న వార్తలను చూసి ఆశ్చర్యపోయాను. ఇక అసిస్టెంట్ కోచ్‌లు కేవలం ఒక్క డిపార్ట్‌మెంట్‌పై మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో దృష్టి సారిస్తూ పనిచేయాలని నేను భావిస్తాను. అందుకే ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లను తీసుకున్నాం''
''శ్రీలంక పర్యటన తర్వాత సహాయక సిబ్బంది గురించి అంతిమంగా నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్‌లో అభిషేక్ నాయర్, ర్యాన్‌తో కలిసి పనిచేశాను. ప్రొఫెనల్స్‌గా వాళ్లతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను'' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గంభీర్ జులై 27 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనతో తన యాక్షన్ మొదలుపెట్టనున్నాడు. లంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆగష్టు 7న చివరి మ్యాచ్ ఆడనుంది.
టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
టీమిండియా వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.