చరిత్ర సృష్టించిన భారత్.. ఐసీసీ అవార్డుల్లో తొలిసారి ఇలా!
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో భారత క్రికెటర్లు సత్తాచాటారు. జూన్ నెలకుగానూ మెన్స్ క్రికెట్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు అవార్డు దక్కింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించడంతో బుమ్రా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి బ్యాటర్ సింగిల్ తీయడానికి కూడా తీవ్రంగా శ్రమించేలా బుల్లెట్ లాంటి బంతులను బుమ్రా సంధించాడు.
మ్యాచ్ చేజారుతున్న ప్రతి సందర్భంలో బౌలింగ్‌కు వచ్చి భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా బుమ్రాకే దక్కింది. ఇప్పుడు ఐసీసీ మరోసారి బుమ్రాను మెచ్చింది. మంత్ అవార్డుకు పోటీలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అఫ్గానిస్థాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను అధిగమించి బుమ్రా అవార్డు గెలుచుకున్నాడు. కాగా, ఐసీసీ మంత్ అవార్డు పొందడం బుమ్రాకు ఇదే తొలిసారి.

మరోవైపు భారత మహిళా స్టార్ క్రికెట్ స్మృతి మంధాన ఉమెన్స్ క్రికెట్‌లో అవార్డు సాధించింది. జూన్ నెలకుగానూ ఉత్తమ క్రికెటర్‌గా ఘనత సాధించింది. అయితే ఈ క్రమంలో భారత్ చరిత్ర సృష్టించింది. ఒకే నెలలో ఐసీసీ మెన్స్, ఉమెన్స్ అవార్డులను అందుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కెంది. 2021 నుంచి ఐసీసీ మంత్ అవార్డులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఒకే దశం నుంచి డబుల్ విన్ మార్క్స్ దక్కడం ఇదే తొలిసారి.

కాగా, స్మృతి మంధాన సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా బౌలర్లకు స్మృతి చుక్కులు చూపిస్తోంది. ఫార్మాట్‌లో సంబంధం లేకుండా సెంచరీ, హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారిస్తుంది. వన్డే సిరీస్‌లో 117, 136, 90 పరుగులు చేసింది. ఇక ఏకైక టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు సాధించింది. తొలి టీ20లో 46 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications