India vs Sri Lanka 3rd T20I: టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ఏకంగా 45 సార్లు..

ధర్మశాల: మూడో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీలంకను ఓడించి టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా 4 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని వైట్‌వాష్ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే స్వదేశంలో జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కూడా నిలిచాడు. కానీ ఈ క్రమంలో హిట్‌మ్యాన్ ఓ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు.

45 సార్లు
మూడో టీ20 మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన చెత్త రికార్డు రోహిత్ శర్మ పేరు మీద నిలిచింది. ఈ ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఏకంగా 45 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును హిట్‌మ్యాన్ అధిగమించాడు. అలాగే ఓపెనర్‌గా కూడా అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ 29 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (28)ను రోహిత్ శర్మ అధిగమించాడు.

అత్యధిక మ్యాచ్‌లు
శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 125 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న రోహిత్ శర్మ.. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124) మ్యాచ్‌ల రికార్డును అధిగమించాడు.

అత్యధిక విజయాలు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో శ్రీలంకపై భారత్‌కు ఇది 17వ విజయం. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన టీంగా టీమిండియా నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును (జింబాబ్వేపై 16 విజయాలు) భారత్ బ్రేక్ చేసింది. అలాగే టీ20 ఫార్మాట్‌లో స్వదేశంలో భారత్‌కు ఇది 40వ విజయం. దీంతో న్యూజిలాండ్ పేరు మీదున్న ఉన్న రికార్డును టీమిండియా అధిగమించింది. కివీస్ తమ స్వదేశంలో 39 విజయాలు సాధించింది.

శ్రేయస్ అయ్యర్ రికార్డులు
భారత్, శ్రీలంక టీ20 సిరీస్‌లోని 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన శ్రేయస్ అయ్యర్ ఒక్క సారి కూడా ఔట్ కాలేదు. ఈ క్రమంలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధికంగా 204 పరుగులు చేసిన భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 199 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు.
అలాగే టీ20ల్లో శ్రీలంకపై వరుసగా 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తర్వాత శ్రీలంకపై వరుసగా 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఇక తన టీ20 కెరీర్లో అయ్యర్ అత్యత్తమ మొదటి, రెండో స్కోర్లను ఈ సిరీస్‌లో నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications