Rohit Sharma: రూ.3.10 కోట్లు విలువ చేసే కారు కొన్న టీమిండియా కెప్టెన్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రత్యర్థులను వరుసగా వైట్‌వాష్‌లు చేస్తూ ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటున్నాడు. అయితే మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ హిట్‌మ్యాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల కోట్ల రూపాయలు విలువ చేసే ఓ కారును కొనడమే దీనికి కారణం. ఈ క్రమంలో ఆ కారును కొన్న తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

రూ.3.10 కోట్ల కారు కొనుగోలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత ఖరీదైన లంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ కారును కొన్నాడు. పర్సనలైజ్డ్ ఇంటీరియర్స్ ఉన్న లంబోర్ఘినీ ఉరుస్ కారు విలువ రూ.3.10 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ విషయాన్ని ఆ కారు షోరూం కంపెనీ అయిన ఆటో మొబైలియర్డెంట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. తద్వారా దేశంలో ఈ ఖరీదైన కారు కొన్న అరుదైన ప్రముఖుల జాబితాలో రోహిత్ శర్మ కూడా చేరాడు. కాగా ముంబైలోని లంబోర్ఘిని షోరూం ఇప్పటికే ఈ కారును రోహిత్ శర్మ ఇంటికి డెలివరీ చేసింది.

ఇష్టమైన కలర్లో తయారు
రోహిత్ శర్మ ఈ విలాసంతమైన కారును తనకు ఇష్టమైన విధంగా డిజైన్ చేయించుకున్నాడు. కారు పైభాగం భారత జట్టు జెర్సీ కలరైన నీలి రంగులో ఉంది. ఈ కారులో సీట్లు చెర్రీ రెడ్ కలర్‌లో ఉన్నాయి. కారు క్యాబిన్ బ్లాక్ కలర్‌లో ఉంది. ఈ కారు ఇంజన్ 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ మోటారు కారు పవర్ సోర్స్‌గా ఉంది. ఈ కారు గరిష్ట పవర్ అవుట్‌పుట్ (650 PS), గరిష్ట టార్క్ అవుట్‌పుట్ (850 Nm) ఉత్పత్తి చేస్తుంది.

కారు ప్రత్యేకతలు
సూపర్ స్పోర్ట్స్ కార్ అయిన ఈ వాహనం ఆల్ సర్ఫేస్ క్వాలిటీ కల్గి ఉంది. దీంతో ఈ కారుతో రోడ్ల మీదనే కాకుండా దట్టమైన ఎడారి ప్రాంతాలలో కూడా రైడ్‌తో చేయవచ్చు. కొండ ప్రాంతాలలో సైతం ఈ కారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయసంగా ముందుకు వెళ్తుంది. రోహిత్ శర్మ కొత్త కారు ఫొటోలు చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు అదిరిపోయిందంటున్నారు. ఎంతైనా రోహిత్ శర్మ టెస్టే వేరని రాసుకొస్తున్నారు.

ఎవరెవరి వద్ద ఉందంటే..
అత్యంత ఖరీదైన ఈ కారు ఇప్పటివరకు కొద్ది మందితోనే ఉంది. ఈ కారు ఉన్న వారిలో బాలీవుడు నటులు రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి ఉన్నారు. ఇక టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంతకాలం కిందటే ఈ కారును కొనుగోలు చేశాడు. మొత్తంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖరీదైన కారు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

టెస్టు సిరీస్‌కు రెడీ
కెప్టెన్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి సారి టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు. శుక్రవారం నుంచి శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌లో టీమిండియాను రోహిత్ శర్మనే నడిపించనున్నాడు. దీంతో ఇందుకోసం టీం మొత్తం రెడీ పోయింది. టీ20ల్లో లంకేయులను చిత్తు చేసిన రోహిత్ సేన, టెస్టుల్లోనూ అదే రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications