స్పెయిన్‌లో ధోని: ఫ్యాన్స్ ఆశ్చర్యం, భారీ షాట్(ఫోటోలు)
మాడ్రిడ్ (స్పెయిన్): టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పెయిన్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఇటీవలే ధోని నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌పై వన్డే సిరిస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం (నవంబర్ 6)న పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోని స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో క్రికెట్ ఆడి అభిమానులను ఉత్సాహపరిచాడు.
మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌లో సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన ధోని అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ధోని రాకను పురస్కరించుకుని మాడ్రిక్ క్రికెట్ క్లబ్ అందుకు తగిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసింది. పిలవగానే క్రికెట్ క్లబ్‌కు వచ్చినందుకు క్లబ్ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ఆదివారం క్లబ్ ట్విట్టర్ పేజిలో పేర్కొంది.
కెప్టెన్ ధోని మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌కు రానున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. 1975లో ఇంగ్లాండ్, ఇండియా ఆటగాళ్లతో ఈ క్రికెట్ క్లబ్ ప్రారంభమైంది. 1982లో బార్సిలోనా క్రికెట్ క్లబ్ ప్రారంభించక ముందు వరకు కూడా స్పెయిల్ అత్యంత ప్రాచుర్యం కలిగిన ఏకైక క్రికెట్ క్లబ్ మాడ్రిడ్ క్రికెట్ క్లబ్.
ఈ క్లబ్‌లోని కీలక ఆటగాళ్లు విదేశాలకు వెళ్లడంతో 1990లో ఈ క్లబ్ కనుమరుగైంది. 2014లో ధోని టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది జనవరి 2017లో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌లో ధోని బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరగనున్న విజయ్ హాజారే ట్రోఫీలో జార్ఖండ్ రాష్ట్రం తరుపున ఆడనున్నాడు.

ధోని రాక కోసం అభిమానులు ఎదురుచూపులు
మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌లో ధోని కోసం ఎదురు చూస్తున్న అభిమానులు. ఆదివారం నవంబర్ 6న స్పెయిన్‌లోని మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌ని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సందర్శించి అభిమానులను ఉత్సాహపరిచాడు.

బ్యాట్‌పై ధోని ఆటోగ్రాఫ్
మాడ్రిడ్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ జాన్ వుడ్‌వార్డ్‌కు బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ ఇస్తున్న టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.

షాట్ ఆడేందుకు సిద్ధమైన ధోని
స్పెయిన్‌లోని మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌లో షాట్ ఆడేందుకు సిద్ధమైన ధోని. క్రీజులో ఎటువంటి బ్యాట్లు, గ్లౌజులు లేకుండా బంతిని ఆడేందుకు సిద్ధమైన ధోని.

డిఫెన్స్ ఆడుతున్న ధోని
మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌లో బంతిని డిఫెన్స్ ఆడుతున్న ధోని. అయితే ధోని హెలికాప్టర్ షాట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న దృశ్యం.

భారీ షాట్ ఆడుతున్న ధోని
మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌లో భారీ షాట్ ఆడుతున్న ధోని. ఈ క్రమంలో అభిమానులంతా ధోని బ్యాట్ వైపు చూస్తున్న దృశ్యం ఇక్కడ మీరు చూడొచ్చు. చివరకు ఓ చక్కటి ఆదివారాన్ని మాడ్రిడ్ క్రికెట్ క్లబ్‌లో అభిమానులు ఎంజాయ్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications