గుర్గావ్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తండ్రి అయ్యారు. శుక్రవారంనాడు ధోనీ సతీమణి సాక్షి ఇక్కడి ఫోర్టీస్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది ధోనీకి మొదటి సంతానం. పాచ 3.7 కేజీల బరువు ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
వచ్చే వారం ఆస్ట్రేలియాలో జరుగబోయే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ధోనీ సిద్దమవుతున్నారు. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. సాధారణంగా సాక్షి భర్త ధోనీతో పాటు విదేశీ పర్యటనలో ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనకు ఆమె ధోనీతో పాటు వెళ్లలేదు.

ధోనీ, సాక్షిలకు జులై 4, 2010లో వివాహం జరిగింది. సాక్షి రావత్ సింగ్ ధోనీ బాల్య స్నేహితురాలు. ఐసిసి ప్రపంచ కప్ వన్డే పోటీలకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఘోరంగా విఫలమైంది. ముక్కోణపు వన్డేలో ఒక్క మ్యాచ్ కూడా భారత్ విజయం సాధించలేదు. దీంతో ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో ధోనీ నాయకత్వం ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.