Mithali Raj: 39 ఏళ్ల వయసులో మిథాలీ రాజ్ విధ్వంసం! చివరి 12 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 సార్లు..

టీమిండియా మహిళా టీం కెప్టెన్ మిథాలీ రాజ్ దూకుడు మాములుగా లేదు. 39 ఏళ్ల వయసులోనూ తన విధ్వంసకర ఆటతో అదరగొడుతుంది. ఆమె వయసు వాళ్లంతా ఇప్పటికే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేయగా మిథాలీ మాత్రం దాదాపు 4 పదుల వయసులోనూ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సాధిస్తుంది. దీంతో ఈ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ మహిళా బ్యాటర్ ఈ వయసులోనూ బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో లేట్ వయసులో సైతం అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. మిథాలీరాజ్ ఇటీవల ఆడిన చివరి 12 మ్యాచ్‌లను గమనిస్తే ఈ మహిళా బ్యాటర్ ఏ రేంజులో చెలరేగుతుందో అర్థమవుతుంది.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తన చివరి 12 మ్యాచ్‌లో మిథాలీ రాజ్ ఏకంగా 8 సార్లు 50 పైగా పరుగులు సాధించింది. ఇందులో అత్యధిక స్కోర్ 79గా ఉంది. కాగా గత 12 మ్యాచ్‌ల్లో మిథాలీ వన్డే స్కోర్లను గమనిస్తే వరుసగా 57*, 30, 23, 66*, 59, 16, 8, 63, 75 *, 59, 72, 79గా ఉన్నాయి. మొత్తంగా గత 12 ఇన్నింగ్స్‌ల్లో మిథాలీ రాజ్ 50 సగటుతో 607 పరుగులు చేసింది. దీంతో 4 పదుల వయసులోనూ అదరగొడుతున్న మిథాలీరాజ్‌పై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తుంది. అభిమానలతోపాటు క్రీడా విశ్లేషకులు మిథాలీ రాజ్ ఆటకు ఫిదా అయిపోతున్నారు. కాగా త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీ రాజ్ ప్రకటించింది.
కెరీర్లో ఇప్పటివరకు 224 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ 51 సగటుతో 7,569 పరుగుల చేసింది. ఇందులో 7 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 125* పరుగులుగా ఉంది. ఇక 89 టీ20 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 2364 పరుగులు చేసింది. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ 97* గా ఉంది. అలాగే 12 టెస్టు మ్యాచ్‌ల్లో 43 సగటుతో 699 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ సారి డబుల్ సెంచరీ సాధించింది. అత్యధిక స్కోర్ 214గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications