'వరల్డ్‌కప్ నుంచి పాక్‌ను తప్పించడం సాధ్యం కాదు, భారత్‌కే నష్టం'

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను తప్పించడం సాధ్యం కాదని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ శశాంక్ మనోహార్‌ను సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ డ్రాప్ట్ నోట్‌ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్‌ను వరల్డ్‌కప్ నుంచి నిషేధించపోతే వరల్డ్‌కప్ నుంచి తామే తప్పుకుంటామని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడకపోతే ఎదురయ్యే సమస్యలపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ లీగల్ కన్సల్టెంట్లతో గురువారం చర్చించేందుకు సిద్ధమయ్యారు.
సీఓఏ వినోద్ రాయ్ అనుమతితోనే బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ డ్రాప్ట్ నోట్‌ని తయారు చేశారు. ఈ డ్రాప్ట్ నోట్‌పై సునీల్ గవాస్కర్ గురువారం ఇండియూ టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ నుంచి పాక్‌ను తప్పించడం సాథ్యం కాదని గవాస్కర్ తేల్చి చెప్పాడు.

గవాస్కర్ మాట్లాడుతూ
గవాస్కర్ మాట్లాడుతూ "వరల్డ్ కప్ నుంచి పాక్‌ను తప్పించాలని బీసీసీఐ ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి ఇతర సభ్య దేశాలు కూడా అంగీకరించాలి. ఇది మీ రెండు దేశాల వ్యవహారం. ఇందులోకి మమ్మల్ని లాగొద్దు అని వాళ్లు అంటే పాకిస్థాన్‌ను తప్పించడం సాధ్యం కాదు. ఐక్య రాజ్య సమితిలోనే ఈ అంశం తేల్చుకోవాలి. అదే సరైన వేదిక" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

పాక్‌తో భారత్ ఆడకూడదు నిర్ణయం తీసుకుంటే
అంతేకాదు వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడకూడదు అని నిర్ణయం తీసుకుంటే అది మనకే నష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఎందుకంటే పాక్‌తో భారత్ ఆడకపోతే ఆ జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. వరల్డ్‌కప్‌లాంటి టోర్నీలో రెండు పాయింట్లు వదులుకోవడం మంచిది కాదు. ఇప్పటివరకు ఆడిన ప్రతి వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ను మనం ఓడించాం. ఈ టోర్నీలో కూడా వాళ్లతో ఆడి ఓడించాలి" అని గవాస్కర్ అన్నాడు.

ఊరికే రెండు పాయింట్లు పాక్‌కు ఇవ్వకూడదు
"ఆ రెండు పాయింట్లు వాళ్లకు ఇవ్వకూడదు. ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోవడం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. అది చాలు. వరల్డ్‌కప్‌లాంటి టోర్నీలో పాకిస్థాన్‌ను అనవసరంగా పాయింట్లు ఇవ్వకూడదు. వాళ్లను ఓడించి సెమీఫైనల్ రాకుండా చేయాలి. పాకిస్థాన్‌తో ఆడకున్నా క్వాలిఫై అయ్యే సత్తా టీమిండియాకు ఉంది" అని గవాస్కర్ చెప్పాడు.

రాజకీయాలు మాట్లాడటం లేదు, నేను దేశంతో ఉన్నా
"కానీ ఊరికే పాక్‌కు ఎందుకు పాయింట్లు ఇవ్వాలి. నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. నేను దేశంతో ఉన్నాను. ప్రభుత్వం, దేశం ఏది నిర్ణయిస్తే దానిని నేను స్వాగతిస్తాను. కానీ పాకిస్థాన్‌తో వరల్డ్‌కప్‌లో ఆడకపోతే మనకే నష్టమన్న వాస్తవాన్ని అభిమానులు గుర్తించాలి" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్
ప్రారంభమవుతుండగా జూన్ 16న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటంతో దీనిపై ఐసీసీ దృష్టి సారించింది. మరోవైపు బీసీసీఐ సైతం పాక్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి సూచన ప్రాయంగా వచ్చింది. ఇలాంటి తరుణంలో గవాస్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications