మనమే నెంబర్ వన్: లంకను మరోసారి క్లీన్‌స్వీప్ చేయగలిగితే..

హైదరాబాద్: ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఖాతాలో కూడా 120 పాయింట్లు ఉన్నప్పటికీ కొద్దిపాటి వ్యత్యాసం కారణంగా దక్షిణాఫ్రికానే నంబర్‌వన్‌గా ఉంది. ఆదివారం నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
టీమిండియాకు ఇదొక అద్భుత అవకాశం. పర్యాటక జట్టు లంకను మరోసారి క్లీన్‌స్వీప్ చేస్తే నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకోగలదు. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. మొదటి వన్డే ధర్మశాలలో రేపు ఉదయం 11.30గంటలకు ప్రారంభంకానుంది.
ధర్మశాల వన్డేలో భారత్ విజయం సాధిస్తే 121 పాయింట్లతో భారత్ మొదటిస్థానానికి వెళ్తుంది.
సుదీర్ఘకాలం పాటు నంబర్‌వన్ స్థానంలో కొనసాగాలంటే భారత్ 3-0తో సిరీస్ గెలవాలి. 2-1తో భారత్ సిరీస్ గెలిచినా 119 పాయింట్లతో యథావిధి రెండో స్థానంలోనే కొనసాగుతుంది. ఫిబ్రవరిలో భారత్.. దక్షిణాఫ్రికాతో 6 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో ఎలాగైనా ర్యాంకులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక 83 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. లంకతో మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The beautiful Dhauladhar range can be a pleasant distraction but you must keep your eyes on the ball. #INDvSL pic.twitter.com/kFLbXtB4gH
— BCCI (@BCCI) December 8, 2017
ప్రకటించిన ప్రాంతాల్లో ధర్మశాల కూడా ఉండటంతో చిన్న ఆందోళన మొదలైంది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కూడా ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌పీసీఏ) మీడియా ప్రతినిధి మోహిత్ సూద్ మాట్లాడుతూ.. 'వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ప్రతి క్షణం సిబ్బంది సిద్ధంగానే ఉంటారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు' అని వివరించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications