హైదరాబాద్: చెన్నై వేదికగా బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఆసీస్ బౌలర్ల దాటికి బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 48.2 ఓవర్లలో 244 పరుగులకే ఆలౌటైంది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్స్ ఆసీస్ బౌలర్ల దాటికి చేతులెత్తేశారు.
ప్రెసిడెంట్ బ్యాట్స్‌మెన్స్‌లో అగర్వాల్, కర్నేవార్(40), కేడీ పటేల్(41) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఏసీ అగర్‌కు నాలుగు వికెట్లు, రిచర్డ్సన్‌కు రెండు, ఫాల్కనర్, జంపా, స్టెయినీస్‌లకు తలో వికెట్ దక్కింది.

అంతకముందు టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. దీంతో ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ , ట్రావిస్ హెడ్, స్టోనిస్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు.
అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కార్ట్ రైట్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వార్నర్ (64)తో కలిసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (55) స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. వార్నర్, స్మిత్‌లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో జట్టు స్కోరు 134 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ (65), స్టోనిస్ (76)లు రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగులు చేసింది. ఇండియన్ బోర్డు ఎలెవన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుశాంగ్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్, అక్షయ్ కార్నేశ్వర్, కుల్వంత్‌లు తలో వికెట్ తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ వార్మప్ మ్యాచ్‌కు ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు విశ్రాంతినిచ్చింది. ఆరు వారాల కింద ఇంగ్లాండ్‌లో సర్రే తరఫున ఆడుతుండగా ఫించ్‌కు పిక్క గాయమైంది. ఇది అధికారిక లిస్ట్-ఎ మ్యాచ్ కానందునఅతడికి విశ్రాంతి కల్పించారు. కాగా, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌కు గుర్‌కీరత్ సింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు.