న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ సూచనకే నా ఓటు: విశ్వవిజేతను నిర్ణయించేది అలానా!

India Bowling Coach Bharat Arun Responded On Boundary Count Rule
India bowling coach Bharat Arun criticises boundary count rule, suggests alternative

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ విజేతను బౌండరీ రూల్ ఆధారంగా ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటించిన ఈ విధానంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ రూల్‌ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాలు సూచనలు కూడా చేశారు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

ఫైనల్ విజేతను నిర్ణయించే క్రమంలో

ఫైనల్ విజేతను నిర్ణయించే క్రమంలో

వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఫైనల్ విజేతను నిర్ణయించే క్రమంలో సూపర్‌ ఓవర్‌ టైగా ముగిస్తే, మరొక సూపర్‌ ఓవర్‌ను వేయిస్తే బాగుంటుందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సైతం తమ అభిప్రాయాలాను వ్యక్తం చేశాడు. తాజాగా టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

సచిన్‌ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను

సచిన్‌ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను

"సూపర్‌ ఓవర్‌ టైగా ముగిస్తే, మరొక సూపర్‌ ఓవర్‌ను వేయిస్తే బాగుంటుందని సచిన్‌ టెండూల్కర్‌ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. అత్యధిక బౌండరీల గెలిచిన జట్టు విజేత అనే నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. విజేతను నిర్ణయించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి" అని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు.

బౌండరీల ఆధారంగా

బౌండరీల ఆధారంగా

"ఇక్కడ బౌండరీల ఆధారంగా జట్టును గెలిచినట్లు ప్రకటించేకంటే, వికెట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం సమంజసంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అదే సమయంలో మరొక సూపర్‌ ఓవర్‌తో విజేతను తేల‍్చినా ఫరవాలేదు" అని భరత్‌ అరుణ్‌ తెలిపాడు. ప్రపంచకప్ గ్రూప్ స్టేజిలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు మరోక అవకాశం ఉండే బాగుండేదని అన్నాడు.

ఐపీఎల్ తరహా నిబంధనలు

ఐపీఎల్ తరహా నిబంధనలు

ప్రపంచకప్‌లో సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) తరహా నిబంధనను తీసుకురావాలని ఈ సందర్భంగా భరత్ అరుణ్ అన్నాడు. ఐపీఎల్‌లో టాప్-2లో నిలిచిన జట్లకు మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీసేన తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, July 22, 2019, 15:04 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X