Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies: 100 వికెట్ల క్ల‌బ్‌లోకి చాహల్.. అత్యంత వేగంగా చేరిన బౌల‌ర్‌గా రికార్డు

India Bowler Yuzvendra Chahal reached the 100 wickets milestone in ODI cricket

అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌లో టీమిండియా స్పిన్న‌ర్ య‌జుర్వేంద్ర చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌న్డే క్రికెట్‌లో 100 వికెట్ల‌ క్ల‌బ్‌లో చేరాడు. వెస్టిండీస్‌తో నేడు జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌కు ముందు వ‌ర‌కు 99 వికెట్లు తీసిన చాహ‌ల్‌.. నేటి మ్యాచ్‌లో ఆ ఘ‌న‌త‌ను చేరుకున్నాడు. తొలి వ‌న్డేలో వెస్టిండీస్ బ్యాట‌ర్ షమర్ బ్రూక్స్‌ను ఔట్ చేసి వ‌న్డే క్రికెట్‌లో చాహ‌ల్ 100 వికెట్లు పూర్తి చేశాడు. చాహ‌ల్ బౌలింగ్‌లో బ్రూక్స్.. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో అత్యంగా వేగంగా ఈ ఘ‌న‌త సాధించిన భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. కేవ‌లం 60 వ‌న్డే మ్యాచ్‌ల్లోనే చాహ‌ల్ 100 వికెట్లు పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా 100 వికెట్లు తీసిన టీమిండియా 22వ బౌల‌ర్‌గా చాహ‌ల్‌ నిలిచాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్ వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల జాబితాలో స్పిన్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే మొద‌టి స్థానంలో ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 269 మ్యాచ్‌లు ఆడి 334 వికెట్లు తీశాడు. కాగా టెస్టు క్రికెట్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల జాబితాలో అనిల్ కుంబ్లే మొద‌టి స్థానంలో ఉన్నాడు. త‌ద్వారా వ‌న్డేలు, టెస్టుల్లో క‌లిపి ఎక్కువ వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ రికార్డు కూడా కుంబ్లే పేరు మీద‌నే ఉంది. అనిల్ కుంబ్లే త‌ర్వాతి స్థానంలో 315 వికెట్ల‌తో శ్రీ‌నాథ్ ఉన్నాడు. 229 వ‌న్డే మ్యాచ్‌ల్లో అత‌ను ఈ వికెట్లు తీశాడు. ఇక మూడో స్థానంలో 288 వికెట్ల‌తో అగార్క‌ర్ ఉన్నాడు. ఇందుకు అత‌ను 191 మ్యాచ్‌లు ఆడాడు.

నాలుగో స్థానంలో జ‌హీర్ ఖాన్ ఉన్నాడు. 194 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన జ‌హీర్ ఖాన్ 269 వికెట్లు తీశాడు. ఆ త‌ర్వాత ఐదో స్థానంలో హ‌ర్బ‌జ‌న్‌సింగ్ ఉన్నాడు. భ‌జ్జీ 234 వ‌న్డే మ్యాచ్‌ల్లో 265 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆరో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఉన్నాడు. క‌పిల్ దేవ్ 225 మ్యాచ్‌ల్లో 253 వికెట్లు తీశాడు. ఇక ఏడో స్థానంలో వెంక‌టేశ్ ప్ర‌సాద్ ఉన్నాడు. వెంకటేశ్ ప్ర‌సాద్ 161 మ్యాచ్‌ల్లో 196 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఎనిమిదో స్థానంలో ర‌వీంద్ర జ‌డేజా ఉన్నాడు. జ‌డేజా 164 వ‌న్డే మ్యాచ్‌ల్లో 188 వికెట్లు తీశాడు. ఇక తొమ్మిదో స్థానంలో 173 వికెట్ల‌తో ఇర్ఫాన్ ప‌ఠాన్ ఉన్నాడు. ప‌ఠాన్ 120 మ్యాచ్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు.

Story first published: Sunday, February 6, 2022, 16:25 [IST]
Other articles published on Feb 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+