కోల్‌కతా: భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 339 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్సులో 316 పరుగులు చేయగా, కివీస్ 204 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్సులో 227 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
ఈడెన్ గార్డెన్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో 204 పరుగులకే న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆలౌట్ అయ్యారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులు చేసిన టీమిండియాకు 112 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్ల పడగొట్టగా, షమీ 3, జడేజా, అశ్విన్‌లు చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా మురళీ విజయ్ 4, ధావన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఎంపైర్లతో కోహీ గొడవ
రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్లతో ఆదివారం గొడవకు దిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 128/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 163/7తో నిలిచిన దశలో చిరుజల్లు కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
అయితే స్పిన్నర్ జడేజా దాదాపు బంతిని విసిరే సమయంలో అతణ్ని అంపైర్ ఆపడంపై కోహ్లీకి కోపం వచ్చినట్లుంది. 'వర్షం భారీగా రావడం లేదు.. అయినా బంతి పూర్తయిన తర్వాత మ్యాచ్‌ను ఆపచ్చు కదా' అనే ఉద్దేశంలో అంపైర్లకు కోహ్లీ సూచిస్తునట్లు మైదానంలో కనిపించింది. దీనిపై చాలాసేపు అంపైర్లు వివరణ ఇచ్చినా.. కోహ్లి సంతృప్తి చెందలేదు.
దాదాపు ఐదు నిమిషాల పాటు కోహ్లీ, అంపైర్ల మధ్య ఈ చర్చ జరిగింది. ఈ సమయంలోనే మైదానంలోని కొంత భాగాన్ని స్టేడియం సిబ్బంది కవర్లతో కప్పి ఉంచినా.. అప్పటికే వర్షం దాదాపుగా ఆగిపోయింది. క్రికెటర్లు కూడా బౌండరీలైన్ వద్దే ఉండటంతో వెంటనే మ్యాచ్‌ను అంపైర్లు తిరిగి కొనసాగించారు. కోహ్ల, అంపైర్ల మధ్య చర్చ జరుగుతున్నంత సేపు ప్రేక్షకుల కేరింతలతో స్టేడియంహోరెత్తించారు.
భారత్ బ్యాటింగ్
- 209 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుటయ్యాడు. 2015 పరుగుల వద్ద జడెజా అవుటయ్యాడు. రోహిత్ శర్మ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. సాహా, భువనేశ్వర్ కుమార్ క్రీజులో ఉన్నారు.
- రెండో టెస్టులో కోహ్లీ కొంత మెరుగ్గా ఆడాడు. అయితే అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ విసిరిన ఇన్ స్వింగర్ బంతిని ఆడే ప్రయత్నంలో కోహ్లి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. బంతి ఊహించిన దానికంటే తక్కువ ఎత్తులో రావడంతో కోహ్లి దానిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేస్తూ పట్టుజారి క్రీజులో పడిపోయాడు. బంతి అతని మోకాలి కింది భాగంలో తాకడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు కోసం అప్పీల్ చేశారు. అంపైర్ ఔట్‌గా ప్రకటించేశాడు. కానీ రిప్లైలో బంతి మధ్య వికెట్‌ను కాకుండా ఆఫ్ సైడ్ వికెట్ వైపు వెళ్తున్నట్లు కనబడింది. బంతి కాలికి తగలగానే క్షణాల వ్యవధిలో కోహ్లి కింద పడిపోవడంతో ఎల్బీడబ్ల్యూపై అంపైర్ సరైన నిర్ణయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోహ్లి కిందపడకుండా ఉన్నట్లయితే అంపైర్ తుది నిర్ణయం ప్రకటించే ముందు మరోసారి సమీక్షించుకొని ఉండేవాడంటున్నారు.
- ఆ తర్వాత రవిచందన్ అశ్విన్ కూడా ఎల్బీగా అవుటయ్యాడు. అశ్విన్ 23 బంతుల్లో 5 పరుగులు చేశాడు.
- ఐదో వికెట్ కోహ్లీ రూపంలో పడింది. కహ్లీ కూడా ఎల్బీగా వెను దిరిగాడు. కోహ్లీ 65 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
- మురళీ విజయ్ 7 పరుగులకు, ధావన్ 17 పరుగులకు ఎల్బీడబ్ల్యుగా, పుజారా 4 పరుగులుకు ఎల్బీగా పెవిలియన్ చేరారు. రహానే 1 పరుగుకే అవుటయ్యాడు. క్రీజులో కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు.
- అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.