భారత ఖాతాలో 500 వన్డే విజయం: ఎవరిపై ఎన్ని విజయాలో తెలుసా?

హైదరాబాద్: మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయ సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో టీమిండియాకు ఈ విజయం 500వది కావడం విశేషం. ఫలితంగా వన్డేల్లో 500 విజయాలను నమోదు చేసిన రెండో జట్టుగా భారత జట్టు అరుదైన ఘనత సాధించింది.
ఈ జాబితాలో 558 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 479 విజయాలతో పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ విజయం ద్వారా టీమిండియాతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అనేక రికార్టులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(116) సెంచరీ సాధించడంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

కెప్టెన్‌గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు
తద్వారా వన్డేల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ పేరుపై ఉండేది. పాంటింగ్ 204 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.

2000 సంవత్సరంలో
2000 సంవత్సరంలో కెన్యాపై గంగూలీ నాయకత్వంలో 200వ విజయం సాధించింది. 2007లో ద్రవిడ్ కెప్టెన్సీలో విండీస్ 300వ, 2012లో కొలంబోలో ధోనీ కెప్టెన్సీలో శ్రీలంకపై 400వ విజయాన్ని నమోదు చేసింది. 400వ విజయంలో సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ, ఇప్పుడు 500 విజయంలోనూ సెంచరీ(116) సాధించాడు.

ఎవరిపై ఎన్ని విజయాలు సాధించిందంటే
విరాట్ కోహ్లీ సెంచరీలు చేసిన 33 వన్డేల్లో భారత్ విజయం సాధించింది. సచిన్ కూడా 33సార్లు సెంచరీలు చేసి భారత్‌ను గెలిపించాడు. అయితే భారత్ ఎక్కువ విజయాలు సాధించింది శ్రీలంకపైనే. ఆ జట్టును ఏకంగా 90సార్లు ఓడించడం విశేషం. ఎవరిపై ఎన్ని విజయాలు సాధించిందంటే..
శ్రీలంక- 90
వెస్టిండీస్- 59
న్యూజిలాండ్- 55
పాకిస్థాన్- 54,
ఇంగ్లండ్ -53,
జింబాబ్వే- 51
ఆస్ట్రేలియా- 49
సౌతాఫ్రికా- 34,
బంగ్లాదేశ్- 29
కెన్యా- 11
ఐర్లాండ్-3
యూఏఈ- 3
హాంకాంగ్-2
నెదర్లాండ్స్-2
ఆప్ఘనిస్థాన్- 1
బెర్ముడా-1
ఈస్ట్ ఆఫ్రికా-1
స్కాట్లాండ్-1
నమీబియా-1
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications