ఇది చరిత్ర: 900 వన్డేలు ఆడిన తొలి జట్టుగా టీమిండియా
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా చరిత్రను సృష్టించింది. ఇటీవలే టెస్టు క్రికెట్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో 500 మ్యాచ్‌ల మైలురాయిని టీమిండియా దాటింది. ఇక, ధర్మశాల మ్యాచ్‌తో వన్డే చరిత్రలో 900 మ్యాచ్‌లు పూర్తిచేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ కూడా ఈ 900 వన్డేల మార్కుకు చేరడానికి చాలా సమయం పడుతుంటే భారత్ మాత్రం మిగతా దేశాలన్నిటికంటే ముందే భారత ఈ ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డేల్లో 900 మ్యాచ్‌లాడిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

భారత్‌లో క్రికెట్ ఓ మతం
ఇక దక్షిణాఫ్రికా 564 వన్డేలతో ఈ మార్కుకి చాలా దూరంలో ఉంది. భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా కొలుస్తారు. ఈ క్రేజ్ వల్లే భారత అందరికంటే ఎక్కువ వన్డేలాడేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత్ జట్టు వన్డే ఛాంపియన్‌గా అవతరించింది.

టెస్టు క్రికెట్‌తో పోలిస్తే భారత్ ఎక్కువ వన్డేలు
కాగా, టెస్టు క్రికెట్‌తో పోలిస్తే భారత్ ఎక్కువ వన్డేలు ఆడింది. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ (976), ఆస్ట్రేలియా (791), వెస్టిండీస్ (518)తో తొలి మూడు స్థానాల్లో ఉండగా... ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌తో ఇప్పటి వరకూ భారత్ 502 మ్యాచ్‌లాడి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగో స్ధానంలో టీమిండియా
వన్డేల్లో భారత్ సాధించిన విజయాల విషయంలో మాత్రం టీమిండియా నాలుగో స్ధానంలో ఉంది. భారత 900 వన్డేల్లో 455 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 399 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇందులో ఏడు మ్యాచ్‌లు టై అవగా 39 వన్డేల్లో ఫలితం తేలలేదు. 888 వన్డేలాడిన ఆసీస్ 547 విజయాలు సాధించి అత్యధిక సక్సెస్ రేటు (64.42)తో మొదటి స్ధానంలో ఉంది.

జింబాబ్వే తక్కువ సక్సెస్ రేటు
564 మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా 64.04 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (54.36) విజయశాతంతో మూడోస్థానంలో ఉంది. 474 వన్డేలాడిన జింబాబ్వే 122 విజయాలు మాత్రమే సాధించి అతి తక్కువ సక్సెస్ రేటు (26.83)తో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications