For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ వన్డే: కోహ్లీసేన విజయం, భారత్ Vs విండిస్ మ్యాచ్ హైలెట్స్

By Nageshwara Rao

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 252 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత స్పిన్నర్లు దెబ్బకు విండిస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.

ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో వెస్టిండిస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్‌(3/28), కుల్దీప్ యాదవ్‌(3/41)లు అద్భుత ప్రదర్శన చేశారు. విండీస్‌ ఆటగాళ్లలో మహ్మద్ (40) పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆ తర్వాత పావెల్‌(30), షాయ్‌ హోప్(23), హోప్(19)లు మినహా ఎవరూ రెండెంకల పరుగులు చేయలేక పోవడం విశేషం. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లతో మరోసారి రెచ్చిపోగా, అశ్విన్‌ కూడా 3 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

India beat West Indies by 93 runs in third ODI: Match highlights

హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీయగా, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌, పార్ట్‌టైమ్‌ బౌలర్‌ జాదవ్‌లకు తలో వికెట్‌ దక్కింది. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

భారత్ Vs వెస్టిండిస్ మ్యాచ్ హైలెట్స్:

* ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్థానంలో నిలిచాడు.
* 294 మ్యాచ్‌లలో ధోని 9,442 పరుగులు చేశాడు. 9,378 పరుగులు చేసిన మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను అతను వెనక్కి నెట్టాడు.
* ఈ జాబితాలో సచిన్‌ (18,426), గంగూలీ (11,363), ద్రవిడ్‌ (10,889) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
* వన్డేల్లో 150 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ల జాబితాలో అశ్విన్‌ చేరాడు.
* అనిల్‌ కుంబ్లే 106, అశ్విన్‌ 111, హర్భజన్‌ 122, జడేజా 129 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు.
* విదేశీ గడ్డపై రవిచంద్రన్ అశ్విన్‌(3/28)కు ఇదే అత్యుత్తమం కావడం విశేషం.
* ధోని తన కెరీర్‌లో 21వ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు.
* అరంగేట్రం చేసిన మొదటి రెండు వన్డేల్లో (3/50, 3/41) వరుసగా మూడు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా కుల్దీప్ అరుదైన ఘనత సాధించాడు.
* అంతక ముందు పియూశ్‌ చావ్లా తన తొలి రెండు వన్డేల్లో (3/37, 3/29) ఈ రికార్డు నెలకొల్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+