For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనోళ్లు ఆరంభంలోనే అదరగొట్టారు: వెస్టిండీస్‌పై గెలుపు

 India Vs West Indies
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆటలో మన యువ క్రీడాకారులు అదరగొట్టారు. సీనియర్లు లేకుండానే పర్యటనకు వెళ్లిన మన కుర్రాళ్లు వెస్టిండీస్‌లో శుభారంభం చేశారు. విండీస్‌తో తొలి, ఏకైక టి-20 మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయంతో తమ ప్రస్థానాన్ని ఆరంభించారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైనా నేతృత్వంలోని యువ భారత్ 16 పరుగులతో విండీస్‌ను చిత్తుచేసింది. పొట్టి క్రికెట్లో విండీస్‌పై టీమిండియాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులు సాధించింది. అరంగేట్రంతోనే బద్రీనాథ్ 43, పార్థివ్ పటేల్ 26 విజృంభించారు. రోహిత్ శర్మ 26, యూసుఫ్ 15, హర్భజన్ 15 లు కూడా దూకుడుగా ఆడి ఆకట్టుకున్నారు.

సామీ 4/16 అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన విండీస్ పూర్తి ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది. డారెన్ బ్రావో 41, శామ్యూల్స్ 27 పరుగులు చేశారు. చివర్లో బార్న్‌వెల్ 34మెరిసినా ఫలితం లేకపోయింది. హర్భజన్ రెండు, ప్రవీణ్, మునాఫ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. బద్రీనాథ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం తొలివన్డే జరగనుంది. భారత్ 6 ఓవర్లలో 46/1తో జోరు మీద కనిపించింది. అయితే ఆ తర్వాత ఎనిమిది పరుగుల తేడాతో భారత్ మూడు కీలక వికెట్లను చేజార్చుకోవడంతో రన్‌రేట్ మందగించింది.

ఈ దశలో బద్రీనాథ్ జట్టును ఆదుకున్నాడు. బద్రీకి రోహిత్ అండగా నిలిచాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. అయితే ఈ జోడీ మొదట్లో ఆచితూచి ఆడటంతో 15 ఓవర్లలో భారత్‌కు 87 పరుగులే వచ్చాయి. ఆ మరుసటి ఓవర్ నుంచి బద్రీ విజృంభించడంతో స్కోరుబోర్డు జోరందుకుంది. అయితే బార్న్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ సంధించిన రోహిత్ ఆ మరుసటి బంతికి వెనుదిరిగాడు. దీంతో 71 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బిషూ వేసిన ఆ తర్వాతి ఓవర్లో బద్రీ కూడా వెనుదిరిగాడు. చివర్లో యూసుఫ్, హర్భజన్ వేగంగా పరుగులు రాబట్టారు.
Story first published: Tuesday, February 27, 2018, 12:54 [IST]
Other articles published on Feb 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+