హైదరాబాద్: అంధుల క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ అజేయంగా దూసుకుపోతోంది. భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. ఇందులో భాగంగా శుక్రవారం భారత్, పాకిస్థాన్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 40 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆ జట్టులో జమీల్ (94 నాటౌట్), కెప్టెన్ నిసార్ అలీ (63) రాణించారు. లక్ష్యాన్ని భారత్ 34.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీపక్ మలిక్ (79 నాటౌట్), వెంకటేశ్ (64), అజయ్‌రెడ్డి (47) సత్తా చాటారు.

ఈ మ్యాచ్లో గెలిచిన అభ్యర్థులకు ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ తో పాటు మిగిలిన అధికార ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు.