Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్షల్ పటేల్ హాఫ్ సెంచరీ బాదాడహో: సంజు శాంసన్ గోల్డెన్ డక్: రెండో టీ20 కూడా మనోళ్లదే

 India beat Northampshire in the 2nd T20I warm up match, Harshal Patel scored 54.

లండన్: ఇంగ్లాండ్ గడ్డ మీద భారత క్రికెట్ జట్టు అదరగొడుతోంది. ఒకపక్క టీమిండియా సీనియర్ల జట్టు.. టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ముప్పతిప్పలు పెడుతోండగా.. మరోపక్క జూనియర్లు ధీటుగా రాణిస్తోన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్ము దులుపుతున్నారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో డెర్బిషైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యంగ్ టీమిండియా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది.

 ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు..

ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు..

ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్ తరువాత టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో- ఈ ప్రాక్టీస్ మ్యాచ్ అవసరమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో 149 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ప్రారంభ ఓవర్లల్లో నార్తాంప్టన్‌షైర్ బౌలర్లు విజృంభించారు. మూడు ఓవర్లలో ఎనిమిది పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది భారత్.

సంజు శాంసన్ గోల్డెన్ డక్..

సంజు శాంసన్ గోల్డెన్ డక్..

ఓపెనర్ సంజు శాంసన్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఖాతా తెరవలేదు. రాహుల్ త్రిపాఠి సైతం ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కొంత నార్తంప్టన్‌షైర్ బౌలర్లను ప్రతిఘటించాడు. 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 51 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో బౌలర్ హర్షల్ పటేల్ జట్టును ఆదుకున్నాడు.

చెలరేగిన హర్షల్..

చెలరేగిన హర్షల్..

ప్రొఫెషనల్ బ్యాటర్‌లా చెలరేగి ఆడాడు. 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్‌లో మూడు భారీ సిక్సులు నమోదయ్యాయి. అయిదు ఫోర్లు బాదాడు. కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌తో కలిసి జట్టు భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. 26 బంతుల్లో దినేష్ కార్తీక్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ ఫర్వాలేదనిపించుకున్నాడు. 20 పరుగులకే వెనుదిరిగాడీ ఆల్‌రౌండర్. అవేష్ ఖాన్ కూడా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

బౌలింగ్‌లోనూ..

బౌలింగ్‌లోనూ..

నార్తాంప్టన్‌షైర్ బౌలర్లల్లో బ్రెండన్ గ్లోవర్ మూడు వికెట్లు పడగొట్టాడు. నాథన్ బక్, ఫ్రెడ్డీ హెల్డ్రీచ్ రెండు చొప్పున వికెట్లు, జోష్ క్యాబ్ ఓ వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్‌షైర్ ఇన్నింగ్ పడుతూ లేస్తూ సాగింది. కేప్టెన్ జోష్ క్యాబ్-4, గస్ మిల్లర్-5, ర్యాన్ రిక్కెల్టన్-3, ఫ్రెడ్డీ హెల్డ్రీచ్-4 పరుగులు చేశారు. సైఫ్ జైబ్ 33 పరుగులు చేశాడు. అతనిదే టాప్ స్కోర్. జేమ్స్ సేల్స్-12, నాథన్ బక్-18, బ్రెండన్ గ్లోవర్-15 పరుగులు చేశారు. 19.3 ఓవర్లల్లో 139 పరుగులకు నార్తాంప్టన్‌షైర్ ఆలౌట్ అయింది. టీమిండియాలో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ రెండు చొప్పున, వెంకటేష్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Story first published: Monday, July 4, 2022, 9:43 [IST]
Other articles published on Jul 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+