Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ను గెలిపించిన యువరాజ్

India
ఇండోర్: ఇంగ్లాండుతో జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండుపై భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బ్యాటింగులోనూ, ఇటు బౌలింగులోనూ విశేషమైన ప్రతిభ కనబరిచిన యువరాజ్ సింగ్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 118 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన యువీ బంతితోనూ అంతే ప్రతిభ కనబరిచి నాలుగు ఇంగ్లాండు వికెట్లు తీశాడు. 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ భారత స్పిన్నర్లకు తలొంచారు. వీరేంద్ర సెహ్వాగ్ మూడు వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ లకు తలో వికెట్ లభించింది. షా మాత్రమే అర్థ సెంచరీ సాధించగలిగాడు. అతను 58 పరుగులు చేశాడు. బెల్ ను ఒక్క పరుగుకే రైనా రన్నవుట్ చేయడంతో ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది. ప్లింటాఫ్ 43, పీటర్సన్ 34 పరుగులు చేశారు.ప్రియర్ 38 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్సమెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఈ విజయంతో భారత్ ఏడు మ్యాచులో సిరీస్ లో 2-0 స్కోరుతో ముందంజలో ఉంది.

ఇండోర్‌లోని మహారాణి ఉషారాజే ట్రస్టు క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన భారత్- ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల పతనానికి 292 పరుగులు చేసింది.ఇంగ్లండ్ బౌలర్లు ప్రారంభంలో కీలక వికెట్లు పడగొట్టి పట్టుసాధించినట్టు కనిపించారు. అయితే యువరాజ్ సింగ్, గంభీర్, చివర్లో యూసఫ్ పఠాన్ (50) రాణించడంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది. యువరాజ్ సింగ్ (118) ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్స్‌లతో వన్డేల్లో పదో సెంచరీ పూర్తి చేసుకున్న యువీ చివరి ఓవర్లలో బ్రాడ్‌ బౌలింగ్‌లో కీపర్ ప్రియర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఓపెనర్ గౌతం గంభీర్ అర్థసెంచరీ (76 పరుగులు) చేసి, పీటర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (1), రైనా (4) పటేల్, రోహిత్ శర్మ (3), మహేంద్ర సింగ్ ధోనీ (15) విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, హార్మిసన్, కాలింగ్‌వుడ్, పీటర్సన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+