Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: కోహ్లీకి 13, వరుసగా 5 సిరిస్‌లను గెలిచిన భారత్

హైదరాబాద్: ఇంగ్లాండ్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్‌తో గత మూడు సిరిస్‌లలో భారత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ పరాభవానికి దెబ్బకు దెబ్బ తీసింది.

ఈ విజయంతో ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ముంబై టెస్టు విజయంతో ఇంగ్లాండ్‌పై టీమిండియా 0-3 ఆధిక్యంలో నిలిచింది. చివరి రోజైన సోమవారం 182/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఇంగ్లాండ్ 13 పరుగులు మాత్రమే జోడించి 195 పరుగులకు ఆలౌటైంది.

దీంతో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముంబై టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్ 12 వికెట్లు తీసుకోవడం విశేషం. టెస్టుల్లో అతను ఒక ఇన్నింగ్స్‌లో ఐదు, అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఇది 24వ సారి.

కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఈ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండే ముంబై టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి.

తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన టీమ్ ఓడిపోవడం ఇదే తొలిసారి

తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన టీమ్ ఓడిపోవడం ఇదే తొలిసారి

వాంఖడే స్టేడియంలో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన టీమ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయగా భారత్ 631 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లలో కోహ్లి (235) డబుల్ సెంచరీ, విజయ్ (136), జయంత్ యాదవ్ (104) సెంచరీలు చేశారు.

అశ్విన్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6, జడేజా 2, భువనేశ్వర్, జయంత్ చెరొ వికెట్ తీసుకున్నారు. అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసుకున్నాడు. ఓ మ్యాచ్‌లో పది వికెట్లు తీసుకోవడం అతనికిది ఏడోసారి. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌‌పై టీమిండియా సిరిస్ గెలిచింది. టెస్టు విజయం తర్వాత టీమిండియా వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేసింది.

వరుసగా ఐదు టెస్టు సిరీస్‌లను గెలిచిన టీమిండియా

వరుసగా ఐదు టెస్టు సిరీస్‌లను గెలిచిన టీమిండియా

కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన ఓ జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇది మూడోసారి. ఈ విజయంతో టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరీస్‌లను గెలిచింది. అంతేకాదు 2014లో ఇంగ్లాండ్‌తో కోల్పోయిన ట్రోఫీని తిరిగి చేజిక్కించుకున్నట్లయింది.

విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా 13వ విజయం

విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా 13వ విజయం

ఇక విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా 13వ విజయం. టీమిండియా మాజీ కెప్టెన్లు ధోనీ, గంగూలీ, అజర్ తర్వాతి స్థానంలో విరాట్ నిలిచాడు. ఇక స్వదేశంలో వరుసగా 17 టెస్టుల నుంచి ఓటమెరగని రికార్డును ఈ మ్యాచ్‌తో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ భారత్‌పై వరుసగా మూడు సిరీస్ విజయాలు సాధించింది. 2011లో ఇంగ్లండ్‌లో, 2012లో భారత్‌లో, 2014లో మరోసారి ఇంగ్లండ్‌లో విజయాలు సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+