భారత్ విజయం: కోహ్లీపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారు
విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా 246 పరుగుల తేడాతో విజయం సాధించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.
405 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది.
87/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 71 పరుగులు మాత్రమే జత చేసి ఆలౌటైంది. ఐదో రోజు భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లాండ్ విలవిలలాడింది. భారత బౌలర్లలో అశ్విన్, యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా, జడేజా, షమీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
విశాఖ టెస్టు విజయం కెప్టెన్ విరాట్ కోహ్లీకి 11వ విజయం. టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో మెరిశాడు. దాంతో ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కోహ్లీ 248 పరుగులు నమోదు చేశాడు.
విశాఖ టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించడంతో ట్విట్టర్‌లో కోహ్లీ సేనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
హర్షా బోగ్లే
రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంపై కామెంటేటర్ హర్షా బోగ్లే ప్రశంసించారు.
మైఖెల్ వాన్
భారత్ చేతిలో 246 పరుగుల తేడాలో రెండో టెస్టులో ఓటమి పాలవడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పైవిధంగా స్పందించింది.
మోహన్ దాస్ మీనన్
2016లో ఇంగ్లాండ్ ఆడిన నాలుగో ఇన్నింగ్స్‌లో వరుసగా వైఫల్యం చెందింది. మిర్ పూర్‌లో ఏ విధంగానైతే వైఫల్యం చెందింతే, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అదే విధంగా జరిగింది.
2016లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ
2016లో అన్ని ఫార్మెట్లలో అత్యధిక పరుగులు(2277) సాధించిన ఆటగాడిగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీకి తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జో రూట్ 2265 పరుగులతో రెండో స్ధానంలో ఉన్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్
రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియాకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలిపాడు.
అజయ్ మీమమ్
రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిచండంపై అజమ్ మీమమ్ శుభాకాంక్షలు తెలిపాడు.
పీర్స్ మోర్గాన్
రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఓటమిపై బ్రిటిష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ పైవిధంగా స్పందించాడు.
ఆకాష్ చోప్రా
రెండో టెస్టులో విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్‌పై కామెంటేటర్ ఆకాష్ చోప్రా పైవిధంగా స్పందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications