న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌పై అప్పట్లో ఒక్క పరుగు తేడాతో భారత విజయం

India beat Bangladesh by one run after stunning World Twenty20 finale

హైదరాబాద్: ఆదివారం బంగ్లాదేశ్‌కు రోహిత్ శర్మ జట్టుకు జరిగిన మ్యాచ్ గుర్తుందిగా.. ఆఖరి బంతి ఆడేంత వరకూ మ్యాచ్ గెలుస్తామనే నమ్మకాలను పూర్తిగా కోల్పోయిన ఒక్క సిక్సుతో మ్యాచ్‌ను శాసించింది. ఇలానే రెండేళ్ల కిందట.. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ విజయానికి సరిగ్గా రెండేళ్లు పూర్తికావస్తుండటంతో ఇప్పుడు దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్‌ అయ్యాయి.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

 ధోనీ నాయకత్వంలో ఆ రోజు:

ధోనీ నాయకత్వంలో ఆ రోజు:

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లోకి వెళ్లాలంటే బంగ్లాపై గెలుపు తప్పనిసరి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. లక్ష్యఛేధనలో ధాటిగా ఆడిన బంగ్లా.. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సివచ్చింది. ఒకటో బంతి సింగిల్‌, రెండు, మూడో బంతులు బౌండరీలు.. అంటే మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లా గెలుస్తుంది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

 పాండ్యా వేసిన బంతి:

పాండ్యా వేసిన బంతి:

కానీ పాండ్యా వేసిన నాలుగో బంతికి ముష్ఫికర్‌ క్యాచౌట్‌! ఫుల్‌ టాస్‌గా వచ్చిన ఐదో బంతికి మమ్మదుల్లా క్యాచ్‌ఔట్‌. ఇక చివరి బంతి.. ఒక్క పరుగు తీసినా మ్యాచ్‌ టై అవుతుంది. సరిగ్గా అప్పుడే మిస్టర్‌ కూల్‌ ధోనీ బంగ్లా కలలపై నీళ్లు జల్లాడు. ఆఫ్‌ స్టంప్‌ బయట పడిన బంతిని బ్యాట్స్‌మన్‌ షువగతా మిస్‌ చేశాడు.

ముస్తాఫిజుర్‌ వచ్చే లోపే ధోనీ:

ముస్తాఫిజుర్‌ వచ్చే లోపే ధోనీ:

నాన్‌స్ట్రైకర్‌ ముస్తాఫిజుర్‌ పరుగు పూర్తిచేసేలోపే.. కీపర్‌ ధోనీ తెలివిగా పరుగెతుడూ వచ్చి బెయిల్స్‌ ఎగరగొట్టాడు. రనౌట్‌. భారత్‌ ఒక్కపరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది. టీ20ల్లో చివరి మూడు బంతులకు మూడు వికెట్లు నేలకూల్చిన భారత రికార్డు ఇంకా పదిలంగానేఉంది.

అంత కష్టపడినా సెమీస్‌లో:

అంత కష్టపడినా సెమీస్‌లో:

భారత్‌ వేదికగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ ఎగరేసుకుపోవడం తెలిసిందే. బంగ్లాపై ఉత్కంఠభరిత విజయం సాధించిన భారత్‌.. సెమీస్‌లో మాత్రం కరీబియన్ల చేతిలో ఖంగుతిన్నది. ఇంగ్లాడ్‌తో జరిగిన ఫైనల్స్‌లో విండీస్‌ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడారు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిఉండగా బ్రాత్‌వైట్‌ సిక్స్‌బాదిన దృశ్యం క్రీడాభిమానుల మనసుల్లోనుంచి చెరిపేయలేనిది.

Story first published: Friday, March 23, 2018, 16:01 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X